సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా వరద పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురవడంతోపాటు పట్టణంలోని ప్రకాశ్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు అజ్మీరాతండ గుట్టపైన 68 మంది, పట్టణంలోని ఇతర భవనాలపై 42 మంది చిక్కుకున్న విషయాన్ని అమిత్ షాకు వివరించారు.
దీంతో తెలంగాణలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్‌ఎఫ్‌ను అమిత్‌షా ఆదేశించారు. చెన్నై, వైజాగ్, అసోం నుంచి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపుతున్నట్లు అమిత్‌షా తెలిపారు. షా ఆదేశాల తర్వాత ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో బండి సంజయ్ మాట్లాడారు.
రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు బండి సూచించారు. కేంద్ర ఆదేశాలతో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తక్షణమే రంగంలోకి దిగాయి.
Comments
Please login to add a commentAdd a comment