
వేములవాడ రూరల్: ‘అంకుల్.. మాకు వాష్‌రూమ్స్, మూత్రశాలలు లేవు, ఇబ్బందులు పడుతున్నాం’అని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కు మొరపెట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వెంకటాంపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన వికసిత్‌భారత్ సంకల్పయాత్రకు సంజయ్ హాజరయ్యారు.
కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో బాలరాజుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను ఎంపీకి ఏకరువు పెట్టారు. దీనికి ఆయన స్పందిస్తూ సౌకర్యాలకు ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలు 24 గంటల్లో తెలపాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment