Wash rooms
-
పక్కా స్కెచ్‌తో పక్క దారి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/అమరావతి: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ వాష్‌రూమ్స్‌లో వెలుగు చూసిన హిడెన్ కెమెరాల వ్యవహారాన్ని ప్రభుత్వం పక్కా స్కెచ్‌తో పక్కదారి పట్టిస్తోంది. ఏదోరకంగా నేరాన్ని కప్పిపుచ్చేందుకు అక్కడ ఏమీ జరగలేదంటూ మసిపూస్తోంది. బాధితులెవరూ నోరు విప్పకుండా ప్రభుత్వం ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కళాశాలకు ఉన్నట్టుండి సెలవులు ప్రకటించడమే కాకుండా.. ఎవరూ, ఎక్కడా నోరెత్తకూడదని విద్యార్థినులకు హెచ్చరికలు జారీ చేసింది. ఏదైనా మాట్లాడితే మున్ముందు చర్యలు తప్పవని యాజమాన్యం ద్వారా హెచ్చరికలు జారీ చేయించింది.యాజమాన్యం ముసుగులో టీడీపీ నేతల దౌర్జన్యం ఈ వ్యవవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇతర రాష్ట్రాల ప్రముఖులు సైతం ఈ ఘటనపై స్పందించడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరకుండా చూసే బాధ్యతను టీడీపీ నేతలకు బాధ్యత అప్పగించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు ఆందోళనకారులు, మీడియా ప్రతినిధులను తరిమికొట్టారు. కళాశాల లోపలికి ఎవరూ వెళ్లకుండా గేట్లు మూసివేశారు. వారికి తోడుగా పోలీసులు సైతం వంత పాడుతున్నారు. నిజంగా అక్కడేమీ జరగకపోతే ఇంత హంగామా ఎందుకని ప్రజా, విద్యా, మహిళ సంఘాలు నిలదీస్తున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగి ఈ కేసును తానే పర్యవేక్షిస్తానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందంటున్న సీఎం చంద్రబాబు.. ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముతున్నారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్ సైతం అక్కడ హిడెన్ కెమెరాలు పెట్టారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని బుకాయిస్తుండటం విద్యార్థుల తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభుత్వ పెద్దలే అలా చెబితే.. పోలీసులు చేతులేత్తేయక ఏం చేయగలరని నిలదీస్తున్నారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే స్వేచ్ఛగా దర్యాప్తు చేయడానికి పోలీసులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే ఆధారాలు వాటంతట అవే వస్తాయని విద్యార్థులు బల్లగుద్ది చెబుతున్నారు. ప్రభుత్వం వేసిన కమిటీ ఇప్పటివరకు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తులో ఇప్పటివరకు వెల్లడైన అంశాలను ఎందుకు దాస్తున్నారని, ఎవరి కోసం ఇలా చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఏమీ లేకపోతే షవర్, సీసీ కెమెరాలు ఎందుకు తీసుకుపోయారని ప్రశ్నిస్తున్నారు.నాలుగు రోజులు గడుస్తున్నా..విద్యార్థినుల ఆందోళనను అణగతొక్కేందుకు ఇప్పటివరకు పోలీసుల సహకారంతో శతవిధాలా ప్రయత్నించిన యాజమాన్యం విద్యార్థులు బెదరకపోవడంతో టీడీపీ నేతల సాయంతో ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దించింది. బలవంతంగా విద్యార్థినులను బస్సుల్లో వారి ఇళ్లకు పంపేస్తున్నారు. విద్యార్థినుల తరలింపును అడ్డుకున్న వారిపై దాడులు చేయిస్తున్నారు. కాలేజీ ప్రధాన గేటు వద్ద పోలీసులతో పాటు టీడీపీ రౌడీలు రాత్రి, పగలు పహారా కాస్తున్నారు. పిల్లల విషయంలో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాల లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా అడ్డుకుంటున్నారు. టీడీపీ చోటామోటా నాయకుల నుంచి బడా నాయకుల వరకు కాలేజీలోకి స్వేచ్ఛగా అనమతిస్తూ.. విద్యార్థుల్ని, విద్యార్థి సంఘాల నాయకుల్ని, ఇతర రాజకీయ పార్టీల నాయకులను లోనికి వెళ్లనివ్వడం లేదు. విద్యార్థినులు ఆందోళన చేస్తునప్పుడు ఒక టీడీపీ నాయకుడు హాస్టల్లోకే వెళ్లి విద్యార్థినులు మాట వినకపోతే కళాశాల నుంచి సర్టిఫికెట్లు రానివ్వకుండా చేస్తామని బెదిరించాడంటే నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు టీడీపీ నాయకులు ఎటువంటి కుయుక్తులు పన్నుతున్నారో అర్థమవుతోంది.నేరం ఒప్పుకున్నా.. వీళ్లెందుకు సమ్మతించడం లేదు?‘కళాశాలలో హిడెన్ కెమెరాలతో బూత్రూమ్ల్లో 300కు పైగా వీడియోలు ఉన్నాయి. నేనే తీశాను. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు దుర్భాషలాడుతూ అన్న మాటలు విద్యార్థినులంతా విన్నారు. కానీ.. కళాశాల యాజమాన్యం తప్పు జరగలేదని బుకాయించేందుకు ఎంతకైనా తెగిస్తోంది. పచ్చమూకల సాయంతో సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాన్ని మొదలుపెట్టింది. కెమెరాలు పెట్టిన విద్యార్థిని స్వయంగా నేరం ఒప్పుకున్నా యాజమాన్యం, ప్రభుత్వం అందుకు సమ్మతించడం లేదు. ఒక్క వీడియో అయినా బయట పడిందా అంటూ నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది. స్వయంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విలేకరుల సమావేశంలో ‘మూడు వేల వీడియోలు ఉన్నాయంటున్నారు. ఆ వీడియోలు ఏవి? బయట పెట్టలేదేంటి?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిజానిజాలను నిగ్గు తేల్చాల్సింది ప్రభుత్వం. విద్యార్థినుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థినులకు న్యాయం చేయాల్సింది పోయి వారిపైనే ఎదురు దాడికి దిగడం ఎంతవరకు సమంజసమని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు.ఎవరూ లేకుండా విచారణఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరినీ కళాశాలలోనే విడివిడిగా మూడు రోజులుగా విచారిస్తున్నా ఇంతవరకు ఒక్క విషయాన్ని కూడా పోలీసులు బయటపెట్టలేదు. కళాశాల యాజమాన్యంతో కలిసి విచారణ చేస్తే నిజాలు ఎలా బయట పడతాయని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. కళాశాల టీడీపీ నాయకుల బంధువులది కావడం.. విద్యార్థినుల మాన, ప్రాణాల కన్నా కాలేజీ పరువు ప్రతిష్టలకే యాజమాన్యం ప్రాధాన్యత ఇవ్వడం.. అందుకు అధికార టీడీపీ సహకరించడమే ఇప్పటివరకు నిజాలు నిగ్గు తేలకపోవడానికి కారణాలుగా పేర్కొంటున్నారు. ఇలా విచారణ చేస్తే కాలయాపన తప్ప తమకు న్యాయం జరిగేది ఏమి లేదనేది విద్యార్థులు పేర్కొంటున్నారు.యథా చంద్రబాబు.. తథా అధికారులుయథా చంద్రబాబు.. తథా అధికారులు అన్న తీరుతోనే కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు సైతం వ్యవహరిస్తున్నారు. ఒకవైపు హిడెన్ కెమెరాలు ఉన్నాయంటున్న షవర్లను స్వాధీనం చేసుకోవడం, అనుమానితుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సైబర్ నిపుణులతో తనిఖీలు చేయిస్తున్నట్టు చెబుతున్న ఎస్పీ.. ఇదేం పెద్ద కేసు కాదని మభ్యపెట్టే ప్రయత్నం చేయడంపై విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి హిడెన్ కెమెరాల వ్యవహారాన్ని దర్యాప్తు పేరుతో కొన్ని రోజులు నాన్చి.. అంతా సద్దుమణిగిన తర్వాత అక్కడేమీ జరగలేదని తీరుబడిగా చెప్పి యాజమాన్యానికి మేలు చేసేలా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం పోలీసులు నడుచుకుంటున్నారని విద్యార్థి నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
ఈ ప్రశ్నలకు బదులేది?
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వాష్ రూమ్‌ల్లో రహస్య కెమెరాల వ్యవహారంలో యాజమాన్యం, ప్రభుత్వం దొంగాటపై ప్రజలు, మేధావులు మండిపడుతున్నారు. జరిగిన ఘటనను దాచిపెట్టడానికి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యాన్ని రక్షించడానికి ప్రభుత్వం తాపత్రయపడుతుండటంపై విమర్శల జడివాన కురుస్తోంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కళాశాలకు వచ్చిన విద్యార్థినుల జీవితాలను రక్షించాలన్న, వారికి భరోసా ఇవ్వాలన్న కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని ప్రజలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో యాజమాన్యం వైఫల్యం.. ప్రభుత్వ నిర్లక్ష్యం సుస్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తదుపరి చర్యలు తీసుకోవడంలో సాగుతూ... ఉన్న జాగుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న గుడ్లవల్లేరు రహస్య కెమెరాల ఘటనపై ప్రజలు, మేధావులు, వివిధ ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు కళాశాల యాజమాన్యం, ప్రభుత్వం బదులివ్వాల్సి ఉంది. ఎందుకీ ఉదాసీనత?: కళాశాలలో సీనియర్ల పేరుతో ఆకతాయిల వేధింపులు శృతిమించినా యాజమాన్యం ఎందుకు అడ్డుకట్టు వేయలేకపోయింది? ఇప్పుడీ ఘటనతో కళాశాల గుర్తింపు పోతోందని గగ్గోలు పెడుతున్న యాజమాన్యం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించింది? చివరకు విద్యార్థినుల వాష్‌రూమ్‌ల్లో రహస్య కెమెరాలు పెట్టే దుస్సాహసానికి కొందరు ఒడిగట్టినా ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు? ఈ విషయమై వారం క్రితమే విద్యార్థులు యాజమాన్యానికి చెప్పినా ఎందుకు పట్టించుకోలేదు? ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారా? చెప్పి ఉంటే ఎందుకు పోలీసులు స్పందించలేదు? వారం రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుంటే వాళ్ల ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? కళాశాల యాజమాన్యం టీడీపీ నేతల బంధువులది కాబట్టి.. చూసీచూడనట్టు వదిలేశారా? ఆదిలోనే ఆకతాయిలకు చెక్ పెట్టి ఉంటే.. అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారేదా? ఇంత దారుణ ఘటన జరిగాక కూడా బాధిత బాలికల్లో నైతిక స్థైర్యం నింపాల్సిన ప్రభుత్వం ఎందుకు యాజమాన్యం పట్ల సానుకూల వైఖరి అవలంబిస్తోంది? రహస్య కెమెరాలతో ఏకంగా 300 వీడియోలు తీసిన భాగోతం భగ్గుమంటుంటే ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడంలేదు? ఎవరెవరి వీడియోలు ఉన్నాయో అనే తీవ్ర మనోవేదనతో ఆడబిడ్డలు ఆందోళన చెందుతుంటే యాజమాన్యం, ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించడం ఎంతవరకు సమంజసం? అని ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఎందుకు యత్నించారు?విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకుని, మనోధైర్యం నింపాల్సిన యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు నిర్బంధంగా వ్యవహరిస్తున్నాయి? కళాశాల పాలకవర్గ సలహాదారు రవీంద్రబాబు రంగంలోకి దిగి విద్యార్థులకు ఎందుకు బెదిరించారు? అమ్మాయిలు ఆందోళన చేయడంతో రంగంలోకి దిగిన మంత్రి కొల్లు రవ్రీంద, ఎస్పీ, కలెక్టర్ వాస్తవాలను తెలుసుకోకుండా వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఎందుకు ప్రయత్నించారు? అసలు విచారణే చేయకుండా.. ఏం జరిగిందో పరిశీలనే చేయకుండా.. ఉదయం 10 గంటలకే ఈ వ్యవహారంలో ఏమీ లేదని ఎస్పీ ఎలా చెప్పగలుగుతారు? కవరింగ్ కోసం మళ్లీ విచారణ చేస్తామని ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది? బాత్ రూమ్‌ల్లో కెమెరాలే లేవని తొలి రోజునే ప్రకటించిన పోలీసులు మరి షవర్లతోపాటు కొన్ని పరికరాలను ఎందుకు స్వాధీనం చేసుకున్నట్టు? వాటిని పరిశీలనకు పంపడం వెనుక మర్మం ఏమిటి? షవర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు షవర్లలో కెమెరాలు ఉన్నా లేవని చెప్పేందుకా? ఉన్న కెమెరాలను తీసివేసేందుకా? విద్యార్థినుల వీడియోలు వైరల్ చేసినట్టు ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో రికవరీలో ఏం గుర్తించనున్నారు? ఇది కూడా యాజమాన్యానికి అనుకూలంగా చేసేందుకు ఆ ఫోన్లలో ఏమీలేవని చెప్పేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాలుగు రోజుల సెలవుల వెనుక అసలు కారణమిదేనా?ఈ ఘటనలో బాధిత బాలికలకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థి సంఘ నేతలు, తల్లిదండ్రులను, మహిళా కమిషన్‌ను హాస్టల్ ప్రాంగణంలోకి వెళ్లకుండా యాజమాన్యం, పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? యాజమాన్యం ఇప్పుడు నాలుగు రోజులు సెలవులు ప్రకటించడం కెమెరాలను మాయం చేసేందుకేనా? విద్యార్థులను ఇంటికి పంపితే.. హాస్టల్ బాత్రూమ్లలో సాక్ష్యాలు తారుమారు చేయడానికేనా? ఆడపిల్లలు.. ఆధారాలు ఉంటే తనకు పంపాలని సీఎం స్థాయి వ్యక్తి చెప్పడం దారుణం కాదా? విద్యార్థుల గ్రూప్‌ల్లో వైరల్ అయినట్టు చెబుతున్న అటువంటి వీడియోలను ఏ మహిళ అయినా పంపిస్తారా? చట్ట ప్రకారం బాధిత యువతుల ఆధారాలు బయటపెట్టకుండా ఘటనపై దర్యాప్తు చేయాలనే కనీస జ్ఞానం కూడా లేదా కోల్పోయారా? కళాశాలను సందర్శించి అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన కనీస బాధ్యత సీఎంకు లేదా? మదనపల్లెలో కాగితాలు తగలబెడితే నానా రాద్ధాంతం చేసి డీజీపీ, సీఐడీ చీఫ్‌లను హెలికాప్టర్లో çపంపిన సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి గంట ప్రయాణం కూడా లేని గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లడంలేదు? ఆడపిల్లల భవిష్యత్తుకు సంబందించిన ఇంతటి సీరియస్ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు తేలిగ్గా తీసుకుంటోంది? ప్రత్యర్థి పార్టీలో ఉన్నవారిపైన కక్షలు తీర్చుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసిగొల్పుతున్న చంద్రబాబు ఆడబిడ్డల రక్షణ విషయంలో ఎందుకు అలక్ష్యం వహిస్తున్నారు? అని విద్యార్థి, ప్రజా, మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.హోం మంత్రి ఎక్కడ?ప్రతిపక్ష నేతను పట్టుకుని వాడు, వీడు అంటూ వెకిలిగా మాట్లాడే హోంమంత్రి అనిత గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లలేకపోయారు? చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఈ వ్యవహారాన్ని వైఎస్సీర్సీపీ మీదకు నెట్టేయడానికి ఎందుకు ప్రయత్నించాయి? ఇది ఎవరి ప్రయోజనం కోసం? అని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారనే ఇంగితం కూడా ఎల్లో బ్యాచ్‌కు లేకపోవడం శోచనీయం కాదా? రాష్ట్రంలో ఐపీఎస్‌లపై కక్షసాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందనేది వాస్తవం కాదా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
అంకుల్.. స్కూల్లో వాష్‌రూమ్స్ లేవు
వేములవాడ రూరల్: ‘అంకుల్.. మాకు వాష్‌రూమ్స్, మూత్రశాలలు లేవు, ఇబ్బందులు పడుతున్నాం’అని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కు మొరపెట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వెంకటాంపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన వికసిత్భారత్ సంకల్పయాత్రకు సంజయ్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో బాలరాజుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను ఎంపీకి ఏకరువు పెట్టారు. దీనికి ఆయన స్పందిస్తూ సౌకర్యాలకు ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలు 24 గంటల్లో తెలపాలని అధికారులకు సూచించారు. -
టాయిలెట్ బిల్లుకు జీఎస్టీ ఘటన!! ఐఆర్సీటీసీ వివరణ
ఢిల్లీ: జీఎస్టీ.. దేశంలో ఇదొక హాట్ టాపిక్ అయిపోయింది. నిత్యావసరాల మొదలు.. చాలావాటిపై కేంద్రం జీఎస్టీ వడ్డన చేయడంతో.. సోషల్‌మీడియాలోనూ విపరీతమైన విమర్శలు వినిపించాయి. తాజాగా టాయిలెట్‌కు వెళ్లినా ఫారినర్లకు భారీ బిల్లుతో పాటు అందులో జీఎస్టీ సైతం పడడంతో కంగుతిన్నారు. దేశ రాజధానిలోనే ఈ ఘటన జరిగింది. ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో వాష్ రూమ్‌ని వాడుకున్నందుకు ఇద్దరు విదేశీ పర్యాటకులు భారీ బిల్లు ఫ్లస్ జీఎస్టీ చెల్లించాల్సి వచ్చింది. అయితే వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన గైడ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. బ్రిటిష్ ఎంబసీ నుంచి విదేశీయులిద్దరూ గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో దిగారు. వాళ్లను శ్రీవాస్తవ అనే గైడ్ రీసివ్ చేసుకున్నాడు. అయితే.. స్టేషన్లో దిగిన వెంటనే ఫ్రెష్ అవ్వాలనుకున్నారు. దీంతో స్టేషన్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లోకి తీసుకెళ్లారు శ్రీవాస్తవ. కేవలం ఐదు నిమిషాల్లో వాళ్లు వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చారు. సాధారణంగా ఐదు, పది రూపాయలు.. మహా అయితే రూ. 20 ఇవ్వాల్సి వస్తుందని శ్రీవాస్తవ భావించారు. కానీ, అక్కడి రిసెప్షనిస్ట్.. రూ. 224 బిల్లు చేతిలో పెట్టడంతో.. ఆయన షాక్ అయ్యారు. ఐదు నిమిషాల పాటు వాష్ రూం వాడుకున్నందుకు ఒక్కొక్కరి బిల్లు రూ. 100లు వేశారు. పైగా దానిపై జీఎస్టీ రూ. 12 జత చేశారు. అలా వారిద్దరికీ కలిపి రూ. 224 బిల్లు అయింది. అంత చెల్లించేందుకు మొదట వాళ్లు ఒప్పుకోలేదు. కానీ, సిబ్బంది ఒత్తిడితో చివరికి చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఐఆర్సీటీసీ ప్రతినిధి బ్రజేష్ కుమార్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లోకి ప్రవేశానికి ప్రత్యేక చార్జ్ ఉందని, దానిపై జీఎస్టీ పడుతుందని చెప్పారు. అంతేకాదు లాంజ్‌లో ఉన్నంతసేపు టూరిస్టులు, ఫారినర్లు ఫ్రీగా వైఫై వాడుకోవచ్చని, కాంప్లిమెంటరీగా కాఫీ కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై గైడ్ శ్రీవాస్తవ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనరల్ కోచ్‌లో ఆగ్రా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తే టికెట్ రూ. 90 రూపాయలు మాత్రమేనని, కానీ స్టేషన్లో వాష్‌రూం వినియోగించుకున్నందుకు రూ. 112 చార్జ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిథి దేవో భవ పిలుపును ఐఆర్సీటీసీ అవమానిస్తోందని, ఇలా చేయడం వల్ల విదేశీయులు ఇక్కడి వ్యవస్థలపై తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకునే ప్రమాదం ఉందని, ఈ వ్యవహారంపై టూరిజం శాఖలో ఫిర్యాదు చేస్తానన్నారు. ఇదీ చదవండి: గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం -
అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం
సాక్షి, ఖమ్మం: కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల విషయం పై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ప్రతీ మీటర్‌పై వ్యాట్ రూపంలో చెల్లిస్తున్న రుసుంతో బంకుల్లో వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి చాలా మందికి తెలియదు. ఒకరిద్దరు నిబంధనల పేరుతో ప్రశ్నిస్తే నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం తెలిసిందే. బంకుల వద్ద వినియోగదారులకు కొన్ని కచ్చితమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ సదుపాయాలు ఏ పెట్రోల్ పంపులోనైనా అందించకపోతే మీరు ఫిర్యాదు చేయొచ్చు. స్వచ్ఛమైన తాగునీరు.. బంకుల వద్ద స్వచ్ఛమైన తాగునీటి వసతి ఉండాలి. ఇందు కోసం బంకు డీలర్ ఆర్వో యంత్రం, వాటర్ కనెక్షన్ స్వయంగా పొందాల్సి ఉంది. ఏ బంకులో కూడ తాగునీటి వసతి సౌకర్యం లేకపోతే చమురు మార్కెటింగ్ సంస్థ కు ఫిర్యాదు చేయవచ్చు. మూత్రశాలలు, మరుగుదొడ్లు.. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని బంకుల్లో వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పలు చోట్ల వీటిని ఏర్పాటు చేసినా వినియోగించేందుకు నిర్వహకులు అనుమతులివ్వటం లేదు. మరికొన్ని చోట్ల అసలు కనిపించని పరిస్థితి నెలకొంది. బంకుల్లో ఇలాంటి సౌకర్యాలు లేనట్లయితే పెట్రోలియం సంస్థలకు ఫిర్యాదు చేయొచ్చు. లీటర్ పెట్రోల్, లేదా డీజిల్ కొనుగోలు చేస్తే అందులో మనం బంకులకు 4 నుంచి 8 పైసల వరకు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణకు చెల్లిస్తున్నాం. ఆపదవేళ ఫోన్ సదుపాయం.. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను వినియోగించుకునే సదుపాయం బంకుల్లో ఉండాల్సిందే. మీరు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మీ వద్ధ మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే భయపడాల్సిన పని లేదు. ఏదైనా పెట్రోల్ బంక్ ను సందర్శించటం ద్వారా మీరు ఏ నంబర్ కు అయినా కాల్ చేసుకోవచ్చు. ఉచితంగా గాలి నింపాల్సిందే.. టైర్లలో గాలి నింపటానికి గాలి శాతం తనీఖీ చేసుకోవటానికి అనువుగా బంకుల్లో కచ్చితంగా యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి. గాలి నింపేందుకు కూడ ఓ వ్యక్తి ని అందుబాటులో ఉంచాలి. బంకులో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకున్నా, వాహనదారులు కోరితే టైర్లలో గాలి తనీఖీ చేయాలి. ఇటీవల కాలంలో వాహనాల టైర్లకు ప్రత్యామ్నయంగా నైట్రోజన్ నింపుతున్నారు. ట్యూబ్‌లెస్ టైర్లు వస్తున్నాయి. వాటిలో నైట్రోజన్ నింపాలి. ఫిర్యాదుల పెట్టె, ప్రథమ చికిత్స కిట్టు ఉండాలి.. ప్రతి బంకులో ఫిర్యాదు పెట్టే లేదా రిజిష్టర్‌ను అందుబాటులో ఉంచాలి. అందులో వినియోగదారుడు తమ ఫిర్యాదులను నమోదు చేయొచ్చు. ప్రథమ చికిత్స కిట్ సౌకర్యం ప్రతి బంకు వద్ధ ఉండాలి. ప్రజలకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ ప్రథమ చికిత్స పెట్టెలో ఆరోగ్యాన్ని రక్షించే మందులు ఉండాలి. దీంతో పాటు అన్ని మందులపై గడువు తేదీ కూడ రాసి ఉంచాలి. పాత మందులు ఉండకూడదు. నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవచ్చు.. పెట్రోల్, డీజీల్ నాణ్యత ప్రమాణాలను తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ నాణ్యత పరిమాణాన్ని తెలుసుకునేందుకు పరికరాలను సిద్ధంగా ఉంచాలి. వాటి ద్వారా నాణ్యత ను పరీక్షించేందుకు హక్కు మనకు ఉంటుంది. అదే విధంగా పెట్రోల్, డీజీల్ తక్కువగా వస్తుందనే అనుమానం వచ్చినా పరీక్షించుకోవచ్చు. అధికారుల పర్యవేక్షణ కరువు.. బంకుల వద్ద ఎన్నో సౌకర్యాలు కల్పించాల్సిన హక్కులు ఉండి కూడ ఏ ఒక్కటి కూడ కల్పించటం లేదు. ముఖ్యంగా బంకులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవటం వలన వారి ఇష్టారాజ్యంగా అవుతుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరు. ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. - బచ్చలకూరి నాగరాజు, కోరట్లగూడెం అవగాహన కల్పించాలి బంకుల్లో ఉన్న సౌకర్యాలను వినియోగించుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలి. అన్నింటికి కలిపి చమురుకు ధరలు చెల్లిస్తున్నారు. కానీ వాటిని మాత్రం వినియోగించుకునే పరిస్థితి లేదు. ఇది చాలా దారుణం. -మాదాసు శ్రీనివాసరావు, కొత్తకొత్తూరు ఫిర్యాదుల పెట్టెలు కనిపించవు బంకులపై ఫిర్యాదు చేసేందుకు కనీసం ఫిర్యాదుల పెట్టెలు కానీ, రిజిష్టర్లు కానీ బంకుల వద్ధ ఎవరికి కనిపించవు. అధికారులకు ఫోన్ చేస్తే స్పందించరు. ప్రజల హక్కులను కూడ వినియోగించుకోలేకపోతున్నారు. బంకుల పై అధికార యంత్రాంగం ఉందా లేదా అనిపిస్తుంది. -రావెళ్ల కృష్ణారావు, మోటాపురం -
ఇక స్మార్ట్ వాష్ రూమ్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని పట్టణ ప్రాంతాల్లో జనాభా అవసరాలకు తగ్గట్టు సమీకృత స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ నిర్ణయించింది. స్వచ్ఛ భారత్ (అర్బన్) మార్గదర్శకాల మేరకు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) లేదా ఇతర పద్ధతుల్లో టాయిలెట్లు, యూరినల్స్, హ్యాండ్‌వాష్‌ల సదుపాయంతో సమీకృత వాష్‌రూమ్స్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. టాయిలెట్, యూరినల్స్, హ్యాండ్ వాష్‌లు ఒకే సముదాయంలో ఉండనున్నాయి. వీటికి అదనంగా ఏటీఎం, ఫొటో కాపీయింగ్ (జిరాక్స్), వైఫై, ఇంటర్నెట్, ప్రింటర్, మీ–సేవాలతో పాటు ఆహ్లాదకరమైన కేఫే సదుపాయాన్ని కల్పిస్తారు. స్మార్ట్ వాష్ రూమ్‌లో ఏర్పాటు చేసే ఇతర వాణిజ్య సముదాయాలతో పాటు ప్రకటనలతో ఆదాయం వచ్చే మార్గాలుంటే వాష్‌రూమ్‌ల వినియోగానికి చార్జీలు వసూలు చేయరు. హైదరాబాద్‌లో పలు చోట్ల వాష్‌రూమ్స్, ఏటీఎం, కేఫేలతో నిర్మించిన ‘లూ కేఫే’లను ఆదర్శంగా తీసుకుని వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. జనాభాకు తగ్గట్టు.. పురుషుల కోసం 100 నుంచి 400 మందికి టాయిలెట్ సీట్ ఏర్పాటు చేయాలని, జన సంచారం 400 మందికి మించి ఉంటే, ఆపై 250 మందికి ఒక టాయిలెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి 50 మందికి ఒక యూరినల్ నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతి ఒక్క టాయిలెట్, యూరినల్‌కు ఒక హ్యాండ్‌వాష్‌ను ఏర్పాటు చేయనుంది. మహిళల కోసం 100 నుంచి 200 మందికి రెండు టాయిలెట్ సీట్లు, 200 మందికి మించితే ప్రతి 100 మందికి అదనంగా మరో ఒక టాయిలెట్ సీట్‌ను నిర్మించనుంది. మహిళల కోసం ప్రత్యేకంగా యూరినల్స్, హ్యాండ్ వాష్‌లు ఏర్పాటు చేయరు. సామూహిక మరుగుదొడ్ల విషయానికి వస్తే ప్రతి 35 మంది పురుషులకు ఒకటి, 25 మంది మహిళలకు ఒకటి చొప్పున టాయిలెట్లు నిర్మిస్తారు. వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు ఉండనున్నాయి. పీపీపీ భాగస్వామ్యంతో.. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో స్థానికంగా సమీకృత స్మార్ట్ వాష్ రూమ్స్, సామూహిక మరుగుదొడ్లకు ఉన్న అవసరాలను గుర్తించేందుకు అధ్యయనం చేసి అవసరమైన మేరకు టాయిలెట్ల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ తాజాగా ఆదేశించారు. పీపీపీ విధానం లేదా ప్రైవేటు వ్యాపారవేత్తల భాగస్వామ్యంతో సుదీర్ఘ కాలం మన్నిక కలిగిన సమీకృత స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలని కమిషనర్లను కోరారు. పీపీపీ భాగస్వామ్యంతో డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీ ఎఫ్‌వోటీ) విధానంలో పురపాలికల్లోని వాణిజ్యపర ప్రాంతాల్లో స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు, ఇప్పటికే ఉన్న పాత టాయిలెట్ కాంప్లెక్స్‌లను రిహాబిలేట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (ఆర్వోటీ) కింద స్మార్ట్ వాష్ రూమ్స్‌గా పునర్నిర్మించేందుకు ప్రైవేటు పార్టీలు ఆసక్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ వాష్ రూమ్స్‌ల ఏర్పాటుకు ఆసక్తి గల ప్రైవేటు సంస్థలు, సొసైటీలు, స్వయం సహాయక సంఘాలు తదితర వాటి నుంచి ఆసక్తి వ్యక్తీకరణను (ఈవోఐ) ఆహ్వానించాలని కమిషనర్లను ఆదేశించారు. స్వచ్ఛ బారత్ మార్గదర్శకాల ప్రకారం ఒక స్మార్ట్ వాష్ రూమ్‌లో ఒక టాయిలెట్ నిర్మాణానికి రూ.98 వేలు, యూరినల్ ఏర్పాటుకు రూ.32 వేల వరకు వ్యయాన్ని అనుమతించనున్నారు. మూడు పద్ధతుల్లో నిర్మాణం.. ప్రైవేటు సంస్థల డిజైన్లకు అనుగుణంగా స్మార్ట్ వాష్ రూమ్స్‌ల నిర్మాణాన్ని అనుమతించనున్నారు. అయితే, డిజైన్లను స్థానిక పురపాలిక/జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. పురపాలిక/జిల్లా కమిటీ రూపొందించిన డిజైన్ ప్రకారం స్మార్ట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయవచ్చు. అయితే, స్థానిక లేఅవుట్‌కు తగ్గట్టు డిజైన్‌కు చిన్నచిన్న మార్పులు అనుమతిస్తారు. ఇప్పటికే ఉన్న పాత టాయిలెట్ సముదాయాల స్థానంలో కొత్తగా స్మార్ట్ వాష్ రూమ్స్‌ను నిర్మిస్తారు. సమయ పాలన.. సామూహిక టాయిలెట్లు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు బాగా వినియోగంలో ఉంటాయి. రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లు, విమానాశ్రాయాల వద్ద ఉండే స్మార్ట్ వాష్‌రూమ్స్ 24 గంటలు వినియోగంలో ఉంటాయి. ప్రధాన వ్యాపార కూడళ్లలో ఉండే వాటికి ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు డిమాండ్ ఉండనుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ వాష్ రూమ్స్ నిర్వహించనున్నారు. -
ఢిల్లీ 6:మహిళల కోసం ఆరు ‘కట్టడాలు’
సౌకర్యం ఇది మామూలు విషయమే కానీ, ఎంతో మంచి విషయం! నార్త్ ఢిల్లీ రెసిడెంట్ వెల్ఫేర్ ఫెడరేషన్ వాళ్లు, ఢిల్లీ పౌరుల సహకారంతో మహిళల కోసం ఆరు ‘కట్టడాలను’ ఏర్పాటు చేయబోతున్నారు. వాటిల్లో ఒక కట్టడం ఇటీవలే కాశ్మీరీ గేట్ మార్కెట్ ప్రాంతంలో పూర్తయి, వారం క్రితమే మహిళలకు అందుబాటులోకి వచ్చింది కూడా. మహిళలకు కట్టడం అనగానే మనకు తాజ్‌మహల్ గుర్తుకు రావచ్చు. ఒక విధంగా ఈ ఆరు కట్టడాలూ మహిళల గౌరవార్థం, అంతకన్నా కూడా వారి అవసరార్థం నిర్మిస్తున్నవే. ఢిల్లీ ప్రభుత్వ ‘భాగీదారి’ (ప్రజల భాగస్వామ్య పథకం) కింద ‘మై ఢిల్లీ ఐ కేర్’ ప్రాజెక్టు పేరుతో ఫెడరేషన్ నిర్మిస్తున్న ఈ కట్టడాలు... వాష్ రూమ్‌లు! ఇటీవలి ఎన్నికల్లో దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో ఓటు వేసేందుకు మహిళా ఓటర్లు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇలాంటి సందర్భంలోనైనా, ఇలాంటి చోటనైనా మహిళలకు వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేయలేకపోయారు అధికారులు. మహిళా సంక్షేమం కోసం పెద్దపెద్ద పథకాలు ప్రకటించే నాయకులు మహిళలకు అత్యవసరమైన పబ్లిక్ టాయ్లెట్ల నిర్మాణంలో, వాటి నిర్వహణల్లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారో... ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే! ‘‘ఇవి మాకెంతో ఉపయోగపడతాయి. మగవాళ్లలా మేము ఢిల్లీ వీధులను బహిరంగ మూత్రశాలలుగా మార్చకపోవచ్చు. అంతమాత్రాన మాకు వాష్‌రూమ్‌ల అవసరం లేదని కాదు కదా. ఇది ఎంతో చిన్న విషయంగా మీకు అనిపించవచ్చు. మహిళలకు మాత్రం అత్యవసరమైనది’’ అని కాశ్మీరీ గేట్ వాష్‌రూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా రాగిణి (22) అనే సేల్స్ ఉమన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నార్త్ ఢిల్లీ ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే ఢిల్లీలోని మరో ఐదు ప్రాంతాలలో మహిళల వాష్‌రూమ్‌లు ఏర్పాటు అయ్యాయి. హనుమాన్ మందిర్ రోడ్, కమలానగర్ మార్కెట్, రోషనార బాగ్ సింగ్ సభ గేట్, రోషనార బాగ్ క్లబ్ గేట్ 2, హిందూరావ్ ఆసుపత్రిలోని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మెడికల్ కాలేజీ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో నిర్మాణం పూర్తయిన దశలో ఉన్న ఈ ఐదు వాష్‌రూమ్‌లు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 వరకు ఈ వాష్‌రూమ్‌లు మహిళలకు అందుబాటులో ఉంటాయి. భద్రతగా అక్కడ మహిళా సిబ్బంది ఒకరు ఉంటారు. ‘‘ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమకూర్చుకోడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. వాష్‌రూమ్ పరిశుభ్రతతో పాటు, భద్రతా సిబ్బంది ఏర్పాటుకు కాస్త పెద్ద మొత్తంలోనే డబ్బు అవసరమౌతుంది. అందుకే ఢిల్లీ పౌరుల చేయూతను మేము అర్థించాం. వారి నుంచి సానుకూల స్పందన రావడంతో ఇంతదూరం రాగలిగాం’’ అని ఫెడరేషన్ అధ్యక్షుడు అశోక్ భాసిన్ అన్నారు. ‘‘గత ఆరేళ్లుగా దేశంలోని మున్సిపల్ కార్పొరేషన్లు తమ బడ్జెట్లో ‘మహిళా టాయ్‌లెట్’ల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాయి. ఢిల్లీ అయితే అంతకు ముందు నుంచే ఈ ప్రాజెక్టు కోసం మల్లగుల్లాలు పడుతోంది. చివరికి ఎలాగైతేనే అందరి సహకారంతో ఆరు వాష్‌రూమ్‌లను నిర్మించగలిగాం’’ అని అశోక్ సంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఏడాది విడుదలైన నివేదిక ప్రకారం ఢిల్లీలో మగవాళ్ల కోసం మొత్తం 3,712 పబ్లిక్ టాయ్లెట్లు ఉండగా, మహిళలకు ఉన్నవి కేవలం 269 మాత్రమే! ఎప్పుడూ రద్దీగా ఉండే చాందినీ చౌక్, కరోల్‌బాగ్ మార్కెట్ ప్రాంతాల్లో అయితే మహిళలకు వాష్‌రూమ్‌ల కొరత మరింత తీవ్రంగా ఉంది. ‘‘మాకిది ప్రధాన సమస్య. వాష్‌రూమ్‌లో అందుబాటులు ఉండవు. ఒకవేళ ఉన్నా అవి శుభ్రంగా ఉండవు. పైగా వాటి దరిదాపుల్లో మాదకద్రవ్యాలకు బానిసలైనవారు తూలుతూ, వాగుతూ కనిపిస్తారు’’ అని చాందినీ చౌక్ దుకాణదారు అరుణిమా కపూర్ అనడంలో... ఇకనైనా మాకు ఈ ఇబ్బందులు తొలగితే మంచిదే కదా అనే ఆశాభావం కనిపిస్తుంది. నార్త్ ఢిల్లీ రెసిడెంట్ వెల్ఫేర్ ఫెడరేషన్లా ప్రతి రాష్ర్టంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన ఇలాంటి సమస్యలపై దృష్టి సారిస్తే అరుణిమ లాంటి మహిళల అసౌకర్యాలు తొలగినట్లే!