
కరాటే కోచ్‌పై దాడి
తీవ్ర గాయాలు
బంజారాహిల్స్: పాత కక్షలతో ఓ కరాటే కోచ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..దమ్మాయిగూడకు చెందిన ఎండీ జహంగీర్ కరాటే కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న అతను యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ నిర్వహిస్తుండగా అక్కడికి వచ్చిన పహాడీషరీఫ్‌కు చెందిన హఫీజ్, ఎజాజ్, ఒమర్‌బిన్, అహ్మద్, షేక్ సల్మాన్ తడితో గొడవపడ్డారు.
హఫీజ్ పాత కక్షలతో జహంగీర్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. మిగతా వారు కూడా అతడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన జహంగీర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.