
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండోరోజు లాక్‌డౌన్ కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో ప్రజలు లాక్‌డౌన్ ఆంక్షలు పాటిస్తూ ఇళ్లకే పరిమితయ్యారు. కానీ చార్మినార్ దగ్గర ఓ ఆటోడ్రైవర్ వీరంగం సృష్టించాడు. చార్మినార్ దగ్గర బందోబస్త్ నిర్వహిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.
తనని ఆపడానికి ప్రయత్నించిన పోలీసులను ఆపొద్దంటూ గొడవ చేశాడు. అక్కడితో ఆగకుండా తన ఆటో అద్దం బద్దలుకొట్టాడు. దీంతో చెయ్యి తెగిపోయి రక్తం కారుతున్నా మత్తులో హంగామా చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తి చేతికి కట్టుకట్టి మంచి నీరు అందించారు.
చదవండి: తెలంగాణ: లాక్‌డౌన్ పక్కాగా అమలు.. ఉల్లంఘిస్తే కేసులే
Comments
Please login to add a commentAdd a comment