మొగులయ్య పాడుతున్న పాట వింటున్న హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు నమో యాప్ ద్వారా సూక్ష్మ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి రవీంద్రనాయక్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్, నాయకులు పాపారావు, డాక్టర్ ఎస్.మల్లారెడ్డి పాల్గొన్నారు. కాగా, మల్కాజిగిరి నుండి కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి సంతోష్‌యాదవ్ నాయకత్వంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
పద్మ పురస్కార గ్రహీతలకు అభినందనలు
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు దర్శనం మొగులయ్య, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావును బండి సంజయ్ స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతిస్వామితో కలిసి ఆయన ఆదివారం సైదాబాద్ సమీపంలోని సింగరేణి కాలనీలో ఉంటున్న మొగులయ్యని కలిసి ఘనంగా సన్మా నించారు. అలాగే సైనిక్‌పురిలో గరికపాటి నర సింహారావును కూడా కలసి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment