సాక్షి,హైదరాబాద్: కవిత బెయిల్ కోసం వాదించడం వల్లే కేసీఆర్ సూచన మేరకు అభిషేక్‌సింఘ్వీని కాంగ్రెస్ రాజ్యసభకు పంపుతోందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం(ఆగస్టు21) బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
‘రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పది మంది కెసిఅర్ ను కలిసిన మాట వాస్తవం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి నిర్ణయించిన వ్యక్తి ఉమ్మడి రాజ్యసభ అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ విలీనం కావడం తథ్యం. బీజేపీని బద్నాం చేయడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు కుటుంబ పార్టీలే. రెండు పార్టీలు అవినీతి పార్టీలు. బీజేపీపై తప్పుడు ప్రచారం చేసే హక్కు వాటికి లేదు.
ఆరు గ్యారంటీలు అమలు చేయలేక దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. విగ్రహాల చర్చ అనవసరం. సచివాలయం ముందు వాజ్‌పేయి విగ్రహం పెట్టాలని మాకు ఉంది. హైడ్రా పెద్ద అసాముల దగ్గరకు వెళ్ళడం లేదు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఖర్చుకు డబ్బులు కావాలి.. అందుకే ఈ కూల్చివేతలు’అని బండిసంజయ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment