Bhatti Vikramarka Great Words On YS Rajasekhar Reddy Padayatra, Details Inside - Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ పాదయాత్ర దేశ రాజకీయాలలో​ ఓ సంచలనం: భట్టి

Published Wed, Jan 4 2023 4:47 PM | Last Updated on Wed, Jan 4 2023 6:35 PM

Bhatti Vikramarka Great Words on YS Rajasekhar Reddy Padayatra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తన పాదయాత్రతోనే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. బుధవారం నగరంలో బోయిన్‌పల్లిలో ఉన్న గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ శిక్షణా తరగతులకు భట్టి విక్రమార్క హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ స్ఫూర్తితో అందరూ పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఆనాడు మీడియా సంస్థలు విచ్చలవిడిగా ఒక నాయకుడినే, ఆ పార్టీతోనే రాష్ట్రం బాగుపడుతుందని చూపిస్తున్న తరుణంలో మహాప్రస్థానం పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో, దేశంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని చెప్పారు. నాలాంటి ఎంతో మంది వైఎస్సార్ పాదయాత్రలో భాగస్వామ్యులు అయ్యారని తెలిపారు.

చదవండి: (‘చంద్రబాబుకు మీడియా సపోర్ట్‌ చేసినా వైఎస్సార్‌ను ఏం చేయలేకపోయారు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement