
చౌటుప్పల్: భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ సర్పంచ్ ఆ గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు పంతులయ్యాడు. పంతంగిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడి పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఎంఏ (తెలుగు) చదివిన సర్పంచ్ బాతరాజు సత్యం.. విద్యార్థుల ఇబ్బందులను గమనించి వారికి పాఠాలు బోధించాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల పాఠశాలలు పునఃప్రారంభం అయినప్పటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. సర్పంచ్‌గా ఉన్న వ్యక్తి పాఠశాలకు వెళ్లి పాఠాలు బోధిస్తుండటంతో పలువురు అతడిని అభినందించారు.
చదవండి: ఓటర్లంతా ఎస్సీ.. బీసీ సర్పంచ్ !
Comments
Please login to add a commentAdd a comment