భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి: మూసీ పునరుజ్జీవం.. ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అని, ఇందుకు ఎన్ని రూ.కోట్లయినా ఖర్చు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని భువనగిరి ఎమ్మె ల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిలాయపల్లి నుంచి బీబీనగర్ మండలం మక్తా అనంతారం వరకు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రజాచైతన్య యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మక్తా అనంతారం మూసీ ఒడ్డున ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
మూసీ కలుషిత జలాల వల్ల రైతులు, కులవృత్తులతోపాటు రేపటి తరాలు జీవచ్ఛవాలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దుస్థితి రాకముందే పునరుజ్జీవంతో ప్రజలను విముక్తి చేయడమే లక్ష్యంగా ప్రభు త్వం ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, వందలాది మంది రైతులు, కులవృత్తిదారులు, కూలీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment