anilkumar reddy
-
మూసీ పునరుజ్జీవం.. ప్రజల ఆకాంక్ష
సాక్షి, యాదాద్రి: మూసీ పునరుజ్జీవం.. ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అని, ఇందుకు ఎన్ని రూ.కోట్లయినా ఖర్చు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని భువనగిరి ఎమ్మె ల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిలాయపల్లి నుంచి బీబీనగర్ మండలం మక్తా అనంతారం వరకు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రజాచైతన్య యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మక్తా అనంతారం మూసీ ఒడ్డున ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మూసీ కలుషిత జలాల వల్ల రైతులు, కులవృత్తులతోపాటు రేపటి తరాలు జీవచ్ఛవాలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దుస్థితి రాకముందే పునరుజ్జీవంతో ప్రజలను విముక్తి చేయడమే లక్ష్యంగా ప్రభు త్వం ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, వందలాది మంది రైతులు, కులవృత్తిదారులు, కూలీలు పాల్గొన్నారు. -
భువనగిరి అసెంబ్లీ టికెట్ హామీతో కాంగ్రెస్‌లో చేరిక
సాక్షి, యాదాద్రి : డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి సొంత గూటికి చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని కుంభం ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే టికెట్‌ను కుంభం ఆశిస్తున్నారు. అయితే బీఆర్ఎస్లో చేరిన కుంభం తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, పీసీసీ పెద్దలు పలువురి నుంచి పార్టీలో చేరాలని ఆహ్వానం వచ్చింది. జూలై 24న బీఆర్ఎస్లోకి.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో విభేదాల కారణంగా గత జూలై 24న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కుంభం బీఆర్ఎస్లో చేరికతో కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో ఒక కుదుపునకు లోనయ్యింది. ఏఐసీసీ నేత ప్రియాంకగాంధీ, పీసీసీ చేపట్టిన సర్వేల్లో పలువురు ఆశావహుల కంటే కుంభంకు విశేష స్పందన రావడంతో ఆయనను తిరిగి రప్పించేందుక కాంగ్రెస్ ప్రయత్నాలు చేపట్టి సఫలమైంది. బీఆర్ఎస్కు తప్పని గట్టి పోటీ కాంగ్రెస్ నుంచి పోటీదారుగా భావిస్తున్న కుంభం ఆ పార్టీని వీడి తమ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ రిలాక్స్ అయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సైతం తనకు పోటీగా బలమైన అభ్యర్థి లేకుండా పోయారని భావించారు. తిరిగి కుంభం సొంత గూటికి చేరడంతో పైళ్లకు గట్టిపోటీ తప్పని పరిస్థితి నెలకొంది. టికెట్ల ప్రకటన రోజునుంచే.. సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకే సీట్లు ప్రకటించిన రోజునుంచే కుంభం మౌనం దాల్చారు. అయితే సూర్యాపేట సభకు సీఎం కేసీఆర్ కుంభంను తన చాపర్‌లో వెంట బెట్టుకుని పోయారు. ఆ రోజునే భువనగిరి టికెట్ తనకు ఇవ్వాలని సీఎంను కోరినట్లు సమాచారం. అయితే కేసీఆర్ ప్రకటించిన సిట్టింగ్ సీట్లలో భువనగిరి కూడా ఉండడంతో కుంభం తీవ్ర నిరాశకు గురయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తారని కేసీఆర్ హామీ ఇచ్చారని కుంభం అప్పట్లో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. బీసీలకు టికెట్ హుళక్కేనా! బీసీలకే టికెట్ అని సాగుతున్న నినాదం హుళక్కేనా అని ఒకవర్గం చర్చిస్తోంది. కర్ణాటక ఫార్ములా ప్రకారం లోక్‌సభ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయంగా ఉంది. అయితే భువనగిరి అసెంబ్లీ సీటు బీసీలకు అని ప్రచారం జరగడంతోపాటు కొందరు బీసీ నాయకులు టికెట్ల కోసం పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పుడు కుంభం చేరికతో భువనగిరి టికెట్ ఆయనకే ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి పీసీసీ ప్రతిపాదించే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకుడొకరు ‘సాక్షి’తో చెప్పారు. కుంభం ఇంటికి భారీగా అనుచరులు కుంభం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడన్న సమాచారంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి అనుచరులు భారీగా చేరుకున్నారు. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజు, పచ్చాల జగన్, ఎల్లంల శాలిని జంగయ్యయాదవ్, ఏర్పుల శ్రీను, గడ్డమీది వీరస్వామిగౌడ్తో పాటుగా సుమారు 500 కార్యకర్తలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంటికే పరిమితం కాలేక డీసీసీ అధ్యక్షుడి హోదాలో బీఆర్ఎస్లో చేరిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీలో ఇమడలేకపోయారు. పదేళ్లుగా ప్రజల మధ్యన ఉన్న ఆయన బీఆర్ఎస్లో చేరి ఇంటికే పరిమితం అయ్యారు. దీనికితోడు ప్రొటోకాల్ ప్రకారం తనకు పదవి కావాలని పార్టీ అధినేతను కోరారు. ప్రస్తుత ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి జోడెడ్లలా పనిచేయాలని, భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయని కేసీఆర్ ప్రటించిన విషయం తెలిసిందే. రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన కుంభం కాంగ్రెస్‌లోని తన వర్గీయులను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. -
ఉచిత విద్యుత్ మా పాలసీ
సాక్షి, హైదరాబాద్: ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మా ప్రభుత్వ పాలసీ. ఈ విషయానికి సంబంధించి కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. వాటిని నేను పట్టించుకోను. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పథకం నిలబడాలి. గ్రామీణ ప్రాంతాలు, రైతులు బాధలు తొలగిపోయి వంద శాతం బాగుండాలి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భూముల డిజిటలైజేషన్ కోసం తెచ్చిన ధరణిని సమస్యగా చిత్రీకరించేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని విమర్శించారు. ధరణితో భూముల మీద యజమానులకు సంపూర్ణ అధికారం వచ్చిందని చెప్పారు. ఈ అధికారాన్ని మీ వద్దే పెట్టుకుంటారా? లేక వదిలేసుకుంటారా? అనేది మీరే నిర్ణయించుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. అనిల్‌కుమార్ రెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన అనుచరులకు కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోతుగా ఆలోచించిన తర్వాతే.. ‘తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర సాధనను ఒక టాస్క్‌గా తీసుకుని పనిచేశాం. మాకు రాజకీయం ఒక టాస్క్ లాంటిది. నేను సిద్దిపేట శాసనసభ్యుడిగా పనిచేసిన నాటి నుంచి మొదలుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కరెంటు విషయంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణనాతీతం. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అధికారులతో జరిపిన చర్చల ద్వారా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర మౌలిక వసతుల్లో సమతుల్యత సాధించాం. ప్రభుత్వ సంపూర్ణ మద్దతు ఉంటే 24 గంటల ఉచిత విద్యుత్ సాధ్యమవుతుందనే అధికారుల వాదనకు కట్టుబడి, పూర్తిస్థాయిలో అండగా నిలిచి ఏడెనిమిది నెలల్లోనే విద్యుత్ సరఫరా లేక ఏర్పడిన దుష్పరిణామాలను సరిదిద్దాం.ఏడు గంటల పాటు ఒకేమారు వ్యవసాయ అవసరాలకు విద్యుత్ ఇవ్వడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకునే 24 గంటల కరెంటుకు మొగ్గు చూపాం. గ్రిడ్ కుప్పకూలకుండా అవసరమైన సమయంలో విద్యుత్ కొనుగోలుకు అవసరమైన విచక్షణాధికారం అధికారులకు ఇవ్వడంతో పాటు సాంకేతిక అంశాలపై అవగాహన ఉండదనే ఉద్దేశంతో ట్రాన్స్‌కో, జెన్కో తదితర సంస్థల నుంచి ఐఏఎస్ అధికారులను తొలగించాం. విద్యుత్ అంశంపై ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించిన తర్వాతే తొమ్మిదేళ్లుగా అమలు చేస్తున్నాం. మూడు గంటల కరెంటు అంటే రైతులు తిడుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోలు అంశంపై ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా గ్రామీణ ప్రాంతాలు కుదుటపడే వరకు కొనసాగిస్తాం. దీంతో ఆర్థికాభివృద్ధి జరిగి తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రస్థానానికి చేరుతుంది. ధాన్యం ప్రాసెసింగ్.. జపాన్ కంపెనీతో చర్చలు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, చెక్‌డ్యాంలు తదితరాలతో భూగర్భ జలాలు పెరిగి పంటల దిగుబడి పెరిగింది. తెలంగాణలో ఇసుక పండినట్లు 3 కోట్ల టన్నుల ధాన్యం వస్తుండటంతో గిర్నీల సామర్ధ్యం కూడా సరిపోవడం లేదు. 2.5 కోట్ల టన్నుల ధాన్యం ప్రాసెసింగ్ కోసం జపాన్ సటాకా కంపెనీతో మాట్లాడుతున్నాం. నేను రైతుబిడ్డగా సిద్దిపేట మార్కెట్లో పడిగాపులు పడిన రోజులను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తున్నాం..’అని సీఎం చెప్పారు. భూములపై సర్వాధికారాలు యజమానులకు.. ‘వీఆర్వోలు భూముల వివరాలు గందరగోళం చేశారు. ధరణి ద్వారా భూముల డిజిటలైజేషన్‌తో వాటిపై సర్వాధికారాలు యజమానుల చేతికి వచ్చాయి. రాష్ట్రంలోని 2.76 కోట్ల ఎకరాల్లో 1.56 కోట్ల భూమి ఇప్పటికే ధరణిలోకి వచ్చింది. ధరణి మూలంగా రైతుబంధు, భూమికి రక్షణ, ధాన్యం కొనుగోలు వంటివి సులభంగా సాధ్యమవుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో భూముల విలువ ఎంతో పెరిగింది. ధరణి లేకపోతే శాంతిభద్రతల సమస్యలు తలెత్తేవి. కొందరు చెప్తున్నట్లు ధరణి తీసేస్తే మళ్లీ లంచాలు మొదలవుతాయి..’అని కేసీఆర్ అన్నారు. జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్లండి ‘భువనగిరిలో ఇద్దరూ పోటీ పడి డబ్బులు తగలేయొద్దు. చెరి ఒక పదవి తీసుకుని జోడెడ్ల బండిలా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లండి.. అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, అనిల్ కుమార్‌రెడ్డికి చెప్పా. కోడె లేగల మాదిరిగా వెలపల, దాపల సమానంగా ఉంటే కచ్చురంగా బాగా ముందుకు పోతుంది. అనిల్‌కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు నాదే బాధ్యత. నాకు ఫిబ్రవరిలో 70 ఏళ్లు వస్తాయి. రేపటి తెలంగాణను పాలించేది మీరే. దారి చూపించి వెళతా..’అని కేసీఆర్ అన్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు ప్రభు త్వ విప్‌లు బాల్క సుమన్, గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, కె.ప్రభాకర్‌రెడ్డి, గ్యాదరి కిషోర్, భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో రెండేళ్లలో ఉచిత విద్యుత్: కేసీఆర్ మహారాష్ట్రలో రైతు ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్రలోని వివిధ పారీ్టలకు చెందిన 76 మంది సర్పంచ్‌లు కూడా సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం చెప్పారు. మహారాష్ట్రలో కూడా రైతులు, ప్రజల జీవన ప్రమాణాలు మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించాల్సిందిగా సర్పంచ్‌లకు సూచించారు. వారిని తెలంగాణ గ్రామాల పర్యటనకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఆదేశించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మహారాష్ట్ర అమరావతి డివిజన్ నుంచి బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో పాటు రైతు సంఘటన, వంచిత్ బహుజన్ అఘాడీ, షెట్కారీ సంఘటనతో పాటు వివిధ పారీ్టలకు చెందిన 76 మంది సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, మహారాష్ట్ర మీడియా యూనియన్ ప్రతినిధులు ఉన్నారు. -
ఉద్యోగాలకు 45 మంది ఎంపిక
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, కడప ఈజీఎం ఆధ్వర్యంలో నవత ట్రాన్స్‌పోర్టులో శనివారం ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించామని డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్లర్క్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 124 మంది హాజరు కాగా, 45 మంది ఎంపికయ్యారన్నారు. ఎంపికైనవారు ఈనెల 5వ తేదీన కడపలోని నవత ట్రాన్స్‌పోర్టులో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి దివాకర్‌రావు, ఏపీఎం నిరంజన్, ఈజీఎం సిబ్బంది మహేష్, పృథ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక రవాణాపై గరంగరం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని సమస్యలతోపాటు అభివృద్ధి గురించి చర్చ జరగాల్సిన జెడ్పీ సమావేశం ప్రొటోకాల్ విషయంతో గందరగోళంగా మారింది. చివరకు సాయంత్రం 3. 30 గంట లకు చర్చ మొదలెట్టగా ఇసుక అక్రమ రవాణాపై సభ దద్దరిల్లింది. దీంతోపాటు రైతు, డ్వాక్రా రుణాలపై మాఫీ గురించి వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ ఆనిల్కుమార్రెడ్డి మట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,37,000 మందికి గాను నెలకు 29 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. సంబంధిత పెంషన్లను త్వరలో పోస్టుఫీసుల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. చాలా గ్రామాలో ఆనర్హులను తొలగించారని తెలుపగా సభలో సభ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో చాలామంది అర్హులుగల వారికి పెన్షన్ తొలగించారని పలువురు జెడ్పీటీసీలు సభ దృష్టికి తీసుకురాగా ఆయన పరిశీలిస్తామన్నారు. టీడీపీ నేతలు చెబితేనే తీసేశారు.. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మట్లాడుతూ 70 ఏళ్ల వయసు ఉండే వారు ఎన్నిసార్లు కార్యాలయ చుట్టూ తిరుగుతారని అన్నారు. వీరికి వయసు తక్కవుండి తొలగించలేదని టీడీపీ నాయకులు చెబితే తొలగించారని ఆరోపించారు. సంబంధిత సమస్యను ఈ నెల 10లోపు పరిశీలిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 10 ఎకరాల పొలం ఉన్నా పింఛన్‌కు అర్హులుగా పెట్టాలని, జిల్లాను కరువు మండలంగా ప్రకటించాలని సభలో సభ్యులు తీర్మాణం చేశారు. అధికార పార్టీకి కాసులపంటగా.. ప్రభుత్వం జిల్లాలో మంజూరు చేసిన ఇసుక క్వారీలు అధికార పార్టీకి కాసుల పంటగా మారాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, వైఎస్ చెర్మైన్ సుబ్బారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఇసుకను అక్రమంగా బెంగుళూరు, కర్నూల్ తరలించి సొమ్ముచేసుకుంటున్నారన్నారు. జిల్లావాసులకు ఇసుకను ఉ చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్నా మొత్తానే అమ్మేస్తే పోదా.. ఎమ్మెల్సీ దేవగుడినారాయణరెడ్డి మాట్లాడుతూ ఇసుక క్వారీలు నిర్వహణ ఎందుకు పెన్నామొత్తాన్నే అమ్మేస్తే పోదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ వచ్చేది కొంచెమైతే అక్రమంగా లక్షల రుపాయల ఇసుక తరలిపోతోందని మండిపడా ్డరు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు, ఎర్రచందనాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్నారని ధ్వజమొత్తారు. మన జిల్లా వనరుల ద్వారా వచ్చే సంపదను మన జిల్లా అభివద్ధికే ఖర్చుచేయాలని తీర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు పలువురు మద్దతును ప్రకటించారు. మంచినీటికి ఇబ్బందులు.. ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ వేంపల్లి, చక్రాయపేట మండలాలలో నదిని నమ్ముకుని వేల ఎకరాలలో పంటలు సాగుచేశారని దీంతోపాటు మంచినీటిని నమ్ముకుని చాలా గ్రామాల ప్రజలు ఉన్నారన్నారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ మైనింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అనుమతుల ఇచ్చారని వారిమేరకే క్వారీలకు అనుమతులు ఇచ్చామన్నారు. క్వారీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకూ ప్రభుత్వం పట్టించుకోలేదని సభలో సభ్యులు ధ్వజమెత్తారు. దీనికి పీడీ స్పందిస్తూ త్వరలో అమరుస్తామని హామీ ఇచ్చారు. సభ్యులందరి డిమాండ్ మేరకు ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు, ముంపుబాధితులకు ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని సభలో తీర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి చైర్మన్ గూడూరు రవి తీర్మాణాన్ని చేశారు. రైతు, డ్వాక్రా, రుణమాఫీపై.. టీడీపీ ప్రభుత్వం ఆర్భాటంగా రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించింది. జిల్లాలో ఎంతమంది ఎంతెంత రుణమాఫీ చేశారు చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ చేయకుండానే చేసినట్లు అజెండాలో పెట్టడంపై కడప ఎమ్మెల్యే అంజాద్బాష, రాచుమల్లు ప్రసాద్రెడ్డిలతోపాటు పలువురు మండిపడ్డారు. రైతుల రుణమాఫీకి సంబంధించి ఒక్క రూపాయకూడా ఇవ్వకుండా ఒక్కో రైతుకు లక్షాయాభై వేలు చేసినట్లు ప్రకనటలు చేయటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే డ్వాక్రా సంఘాలకు సంబంధించి 600 కోట్లు ఉంటే అందులో 294 కోట్లు మాఫీ చేస్తామని ఇంతవరకూ ఒక్క రుపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. రాయచోటి ఎమ్మె ల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు సంబందించి రుణమాఫీ కోసం పత్రాలను ఇచ్చారని ఇంతవరకూ ఒక్క రైతుకు కూడా మాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. ఈ సమయంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ వల్లూరు మండలంలో ఓ సొసైటీలో 18 వందల మంది రైతులకు సంబంధించి రుణమాఫీ జరిగితే కేవలం 6 మందికి మాత్రమే మాఫీ వర్తించిందన్నారు. అందులో కూడా ఒకొక్క రైతుకు ఆరు వందలు, ఎనిమిది వందల చొప్పు న వచ్చిందన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ 3 వేల కోట్ల రుణం ఉంటే అందులో 10 శాతం కూడా మాఫీ కాలేదన్నారు. ఎమ్మెల్యే రా చమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఏదో రుణమాఫీ చేసినట్లు ఈ ఏడాది సంక్రాంతి పండుగను ప్రజలు ముందుగానే చేసుకుంటారని అనటం విడ్డూరంగా ఉందన్నారు. పట్టుబట్టిన మైదుకూరు జెడ్పీటీసీ: డ్వాక్రా రుణాలకు మాఫీ గురించి అధికారులు సమాధానం చెప్పాలని మైదుకూరు జెడ్పీటీసీ పట్టుపట్టారు. ఇంతలో కలెక్టర్ జిల్లా అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది సభలో ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ అధికారులు ఉండి మిగతావారు వెళ్లాలని చెప్పటంతో ఒక్కసారిగా అధికారులంతా పైకి లేచారు. దీంతో సభలో సభ్యులంతా సమస్యల గురించి జిల్లా ప్రజలు అల్లాడుతుంటే ‘వీడియో కాన్ఫరెన్సు ముఖ్యమా’ అని ధ్వజమెత్తారు. అధికారులు లేకుండా సభను జరపవద్దని నినాదాలు చేశారు. దీంతో జెడ్పీ చైర్మన్ గూడూరు రవి సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఈ సమవేశంలో సీఈఓ మాల్యాద్రి, శాసనమండలి విపక్షనేత రామచంద్రయ్య, ప్రభుత్వ విష్ మేడా మల్లిఖార్జునరెడ్డి, ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యేలు పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలతోపాటు జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.