జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, కడప ఈజీఎం ఆధ్వర్యంలో నవత ట్రాన్స్‌పోర్టులో శనివారం ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించామని డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, కడప ఈజీఎం ఆధ్వర్యంలో నవత ట్రాన్స్‌పోర్టులో శనివారం ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించామని డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్లర్క్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 124 మంది హాజరు కాగా, 45 మంది ఎంపికయ్యారన్నారు. ఎంపికైనవారు ఈనెల 5వ తేదీన కడపలోని నవత ట్రాన్స్‌పోర్టులో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి దివాకర్‌రావు, ఏపీఎం నిరంజన్, ఈజీఎం సిబ్బంది మహేష్, పృథ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.