కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని సమస్యలతోపాటు అభివృద్ధి గురించి చర్చ జరగాల్సిన జెడ్పీ సమావేశం ప్రొటోకాల్ విషయంతో గందరగోళంగా మారింది. చివరకు సాయంత్రం 3. 30 గంట లకు చర్చ మొదలెట్టగా ఇసుక అక్రమ రవాణాపై సభ దద్దరిల్లింది. దీంతోపాటు రైతు, డ్వాక్రా రుణాలపై మాఫీ గురించి వాడివేడిగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా డీఆర్‌డీఏ పీడీ ఆనిల్‌కుమార్‌రెడ్డి మట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,37,000 మందికి గాను నెలకు 29 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. సంబంధిత పెంషన్లను త్వరలో పోస్టుఫీసుల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. చాలా గ్రామాలో ఆనర్హులను తొలగించారని తెలుపగా సభలో సభ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో చాలామంది అర్హులుగల వారికి పెన్షన్ తొలగించారని పలువురు జెడ్పీటీసీలు సభ దృష్టికి తీసుకురాగా ఆయన పరిశీలిస్తామన్నారు.
టీడీపీ నేతలు చెబితేనే తీసేశారు..
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మట్లాడుతూ 70 ఏళ్ల వయసు ఉండే వారు ఎన్నిసార్లు కార్యాలయ చుట్టూ తిరుగుతారని అన్నారు. వీరికి వయసు తక్కవుండి తొలగించలేదని టీడీపీ నాయకులు చెబితే తొలగించారని ఆరోపించారు. సంబంధిత సమస్యను ఈ నెల 10లోపు పరిశీలిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 10 ఎకరాల పొలం ఉన్నా పింఛన్‌కు అర్హులుగా పెట్టాలని, జిల్లాను కరువు మండలంగా ప్రకటించాలని సభలో సభ్యులు తీర్మాణం చేశారు.
అధికార పార్టీకి కాసులపంటగా..
ప్రభుత్వం జిల్లాలో మంజూరు చేసిన ఇసుక క్వారీలు అధికార పార్టీకి కాసుల పంటగా మారాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, వైఎస్ చెర్మైన్ సుబ్బారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఇసుకను అక్రమంగా బెంగుళూరు, కర్నూల్ తరలించి సొమ్ముచేసుకుంటున్నారన్నారు. జిల్లావాసులకు ఇసుకను ఉ చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పెన్నా మొత్తానే అమ్మేస్తే పోదా..
ఎమ్మెల్సీ దేవగుడినారాయణరెడ్డి మాట్లాడుతూ ఇసుక క్వారీలు నిర్వహణ ఎందుకు పెన్నామొత్తాన్నే అమ్మేస్తే పోదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ వచ్చేది కొంచెమైతే అక్రమంగా లక్షల రుపాయల ఇసుక తరలిపోతోందని మండిపడా ్డరు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు, ఎర్రచందనాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్నారని ధ్వజమొత్తారు. మన జిల్లా వనరుల ద్వారా వచ్చే సంపదను మన జిల్లా అభివద్ధికే ఖర్చుచేయాలని తీర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు పలువురు మద్దతును ప్రకటించారు.
మంచినీటికి ఇబ్బందులు..
ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ వేంపల్లి, చక్రాయపేట మండలాలలో నదిని నమ్ముకుని వేల ఎకరాలలో పంటలు సాగుచేశారని దీంతోపాటు మంచినీటిని నమ్ముకుని చాలా గ్రామాల ప్రజలు ఉన్నారన్నారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ మైనింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అనుమతుల ఇచ్చారని వారిమేరకే క్వారీలకు అనుమతులు ఇచ్చామన్నారు.
క్వారీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకూ ప్రభుత్వం పట్టించుకోలేదని సభలో సభ్యులు ధ్వజమెత్తారు. దీనికి పీడీ స్పందిస్తూ త్వరలో అమరుస్తామని హామీ ఇచ్చారు. సభ్యులందరి డిమాండ్ మేరకు ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు, ముంపుబాధితులకు ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని సభలో తీర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి చైర్మన్ గూడూరు రవి తీర్మాణాన్ని చేశారు.
రైతు, డ్వాక్రా, రుణమాఫీపై..
టీడీపీ ప్రభుత్వం ఆర్భాటంగా రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించింది. జిల్లాలో ఎంతమంది ఎంతెంత రుణమాఫీ చేశారు చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ చేయకుండానే చేసినట్లు అజెండాలో పెట్టడంపై కడప ఎమ్మెల్యే అంజాద్‌బాష, రాచుమల్లు ప్రసాద్‌రెడ్డిలతోపాటు పలువురు మండిపడ్డారు. రైతుల రుణమాఫీకి సంబంధించి ఒక్క రూపాయకూడా ఇవ్వకుండా ఒక్కో రైతుకు లక్షాయాభై వేలు చేసినట్లు ప్రకనటలు చేయటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే డ్వాక్రా సంఘాలకు సంబంధించి 600 కోట్లు ఉంటే అందులో 294 కోట్లు మాఫీ చేస్తామని ఇంతవరకూ ఒక్క రుపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. రాయచోటి ఎమ్మె ల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు సంబందించి రుణమాఫీ కోసం పత్రాలను ఇచ్చారని ఇంతవరకూ ఒక్క రైతుకు కూడా మాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. ఈ సమయంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ వల్లూరు మండలంలో ఓ సొసైటీలో 18 వందల మంది రైతులకు సంబంధించి రుణమాఫీ జరిగితే కేవలం 6 మందికి మాత్రమే మాఫీ వర్తించిందన్నారు.
అందులో కూడా ఒకొక్క రైతుకు ఆరు వందలు, ఎనిమిది వందల చొప్పు న వచ్చిందన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ 3 వేల కోట్ల రుణం ఉంటే అందులో 10 శాతం కూడా మాఫీ కాలేదన్నారు. ఎమ్మెల్యే రా చమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఏదో రుణమాఫీ చేసినట్లు ఈ ఏడాది సంక్రాంతి పండుగను ప్రజలు ముందుగానే చేసుకుంటారని అనటం విడ్డూరంగా ఉందన్నారు.
పట్టుబట్టిన మైదుకూరు జెడ్పీటీసీ:
డ్వాక్రా రుణాలకు మాఫీ గురించి అధికారులు సమాధానం చెప్పాలని మైదుకూరు జెడ్పీటీసీ పట్టుపట్టారు. ఇంతలో కలెక్టర్ జిల్లా అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది సభలో ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ అధికారులు ఉండి మిగతావారు వెళ్లాలని చెప్పటంతో ఒక్కసారిగా అధికారులంతా పైకి లేచారు. దీంతో సభలో సభ్యులంతా సమస్యల గురించి జిల్లా ప్రజలు అల్లాడుతుంటే ‘వీడియో కాన్ఫరెన్సు ముఖ్యమా’ అని ధ్వజమెత్తారు.
అధికారులు లేకుండా సభను జరపవద్దని నినాదాలు చేశారు. దీంతో జెడ్పీ చైర్మన్ గూడూరు రవి సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఈ సమవేశంలో సీఈఓ మాల్యాద్రి, శాసనమండలి విపక్షనేత రామచంద్రయ్య, ప్రభుత్వ విష్ మేడా మల్లిఖార్జునరెడ్డి, ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యేలు పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలతోపాటు జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఇసుక రవాణాపై గరంగరం
Published Sun, Jan 4 2015 3:11 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement