సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ఉద్యోగులు భూగర్భంలోనే చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించి ప్రమాదానికి గల కారణాలను అన్వేషించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు బండి సంజయ్.
రాష్ట్ర సాగునీరు, విద్యుత్ అవసరాలు తీర్చే శ్రీశైలం జలాశయం లాంటి సున్నితమైన, అత్యంత ప్రాధాన్యమైన ప్రాంతాల భద్రతపై ఎలాంటి ఉదాసీనత దరి చేరనీయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు బండి సంజయ్.
Comments
Please login to add a commentAdd a comment