సాక్షి, వరంగల్: ఓరుగల్లు గడ్డకు నా నమస్కారం అంటూ తెలుగులో నడ్డా ప్రసంగం ప్రారంభించారు. టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అంధకారంలో ఉందని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ప్రజాసంగ్రామ యాత్ర సంకల్పమని జేపీ నడ్డా వ్యాఖ్యనించారు. త్వరలోనే కేసీఆర్‌ను ప్రజలు ఇంటి దగ్గర కూర్చోబెడతారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధుల్ని టీఆర్‌ఎస్ సర్కార్ దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు.
► హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభ వేదికపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకున్నారు. నడ్డా వెంట, బండి సంజయ్, కిషన్‌రెడ్డి, తరుణ్ చుగ్, విజయశాంతి, డీకే అరుణ, రఘునందనరావు తదితరులు ఉన్నారు. కాగా బండి సంజయ్ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ ఈ సభ ఏర్పాటు చేసింది.
►ఉద్యమకారుడు, ప్రొఫెసర్ వెంకటనారాయణ ఇంటికి జేపీ నడ్డా చేరుకున్నారు. ఆయనతో నడ్డా కాసేపు ముచ్చటించారు.
► బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్ చేరుకున్నారు. మధ్యాహ్నం 3.20 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్ చేరుకున్న జేపీ నడ్డా భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, తరుణ్ చుగ్ ఉన్నారు.
►ఆలయ పండితులు నడ్డాకు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. అమ్మవారి పూజలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు... ధ్వజస్తంభం వద్ద దీపం వెళ్లించారు. అనంతరం ఆలయ పండితులు నడ్డాను ఆశీర్వదించారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. భద్రకాళి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్ చేరుకున్నారు. 22 రోజులపాటు అయిదు జిల్లాల్లో పాదయాత్ర సాగింది. 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 300కు పైగా కిలోమీటర్లు నడించారు బండి సంజయ్. ఉత్కంఠ ఉద్రిక్తతల మధ్య మూడో విడత పాదయాత్ర ముగిసింది.
ఇక సాయంత్రం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. తరువాత సాయంత్రం 6 గంటకు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు జేపీ నడ్డా చేరుకోనున్నారు. వరంగల్ సభ అనంతరం హైదరాబాద్ తిరుగు పయనం అవుతారు. రాత్రి 7.30 నిమిషాలకు శంషాబాద్ నోవాటెల్‌లో హీరో నితిన్‌తో భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో జేపీ నడ్డాతో మిథాలీరాజ్ సమావేశమయ్యారు.
చదవండి: జేపీ నడ్డా పర్యటన.. ‘చెప్పులు మోసే గులాం ఎవరో?’: కేటీఆర్ సెటైర్లు
Comments
Please login to add a commentAdd a comment