BRS Party: సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ | BRS Ffields Padma Rao Goud from Secunderabad Lok Sabha Seat | Sakshi
Sakshi News home page

BRS Party: సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌

Published Sat, Mar 23 2024 4:31 PM | Last Updated on Sat, Mar 23 2024 5:14 PM

BRS Ffields Padma Rao Goud from Secunderabad Lok Sabha Seat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి బీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను ఎంపీ అభ్యర్థిని ఖరారు చేస్తూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈ మేరకు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ శనివారం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయం మేరకు సికింద్రాబాద్‌ అభ్యర్థిగా పద్మారావు పేరును ఖరారు చేశారు. కాగా ఇప్పటి వరకు 14 స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి, నల్గొండ, హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
చదవండి: Liquor Case: ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడిగింపు

బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు వీరే..

  • నాగర్‌కర్నూల్‌ - ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.
  • మెదక్‌ - వెంకట్రామిరెడ్డి.
  • మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ - మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి
  • క‌రీంన‌గ‌ర్- వినోద్ కుమార్.
  • పెద్దప‌ల్లి - కొప్పుల ఈశ్వర్.
  • జ‌హీరాబాద్ - గాలి అనిల్ కుమార్
  • ఖ‌మ్మం - నామా నాగేశ్వర్ రావు.
  • చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్.
  • మ‌హ‌బూబాబాద్- మాలోత్ క‌విత‌.
  • మ‌ల్కాజ్‌గిరి - రాగిడి ల‌క్ష్మారెడ్డి
  • ఆదిలాబాద్ - ఆత్రం స‌క్కు.
  • నిజామాబాద్ - బాజిరెడ్డి గోవ‌ర్ధన్.
  • వ‌రంగ‌ల్ - క‌డియం కావ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement