సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఈసీ బృందం అక్టోబర్ 3 నుంచి హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై శాసనసభ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ ఆదేశించారు.
ఎన్నికల సంఘం పర్యటన నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి.. సచివాలయంలో శుక్రవారం అధికారులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి సన్నద్ధతను ఈసీకి వివరించాలని చెప్పారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున పోలింగ్‌కు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అన్ని వివరాలను ఏకరూపంగా అందించాలని స్పష్టం చేశారు.
అదే విధంగా పోలింగ్ కేంద్రాల్లో కల్పించనున్న కనీస వసతుల వివరాలు ఇవ్వాలని సీఎస్ చెప్పారు. వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో చర్చించి వీల్ ఛైర్లను సమకూర్చుకొని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఏఈఆర్ఓ, ఈఆర్ఓ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పారు. సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన సమీకృత చెక్ పోస్టుల వివరాలను ఈసీకి అందించాలని అధికారులను ప్రధాన కార్యదర్శి అదేశించారు.
ఇది కూడా చదవండి: నాడు ఎన్టీఆర్‌ను ఓడించిన నేత.. నేడు బీఆర్‌ఎస్‌కు రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment