సాక్షి, న్యూఢిల్లీ : వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వ్యవస్థ అమలుచేస్తున్న తెలుగు రాష్ట్రాలు సంస్కరణలను విజయవంతంగా పూర్తి చేయడంతో అదనపు రుణాలు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సంస్కరణల కోసం నిర్దేశించిన షరతులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లు నెరవేర్చాయని వివరించింది. ఈ నేపథ్యంలో ఈ 9 రాష్ట్రాలకు రూ.23,523 కోట్లు అదనపు రుణాలు ఇవ్వడానికి అనుమతించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,525 కోట్లు, తెలంగాణకు రూ.2,508 కోట్లు అదనంగా రుణాలు అందనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment