
సాక్షి,హైదరాబాద్ః చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై బెదిరింపులకు పాల్పడడాన్ని టెంపుల్స్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్ కన్వీనర్ డాక్టర్ ఎంవీ సౌందర్ రాజన్ ఖండించారు. ఈ మేరకు ఆయన ఆదివారం(ఫిబ్రవరి 9) ఒక ప్రకటన విడుదల చేశారు.
ఫిబ్రవరి 7న తన కుమారుడు రంగరాజన్‌పై కొందరు బెదిరింపులకు పాల్పడినట్లు సౌందర్ రాజన్ తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై తన కుమారుడు రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సౌందర్ రాజన్ వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరపాలని సౌందర్‌రాజన్ కోరారు.చిలుకూరి బాలాజీ ఆశీస్సులతోనే తన కుమారుడు క్షేమంగా బయటపడ్డాడడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment