Chilukuru balajee temple
-
ఈ అమానుష దాడి దురదృష్టకరం: కిషన్‌రెడ్డి
ఢిల్లీ: చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు. ‘చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ రంగ రాజన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారు. అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి నిందనీయం,బాధాకరం, దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలి.ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. యువతకు, విద్యార్థులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న శ్రీ రంగరాజన్.. దేవాలయాలను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడే విషయంలో ముందువరసలో ఉన్నారు. దీన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. సంబంధిత అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నాను. బీజేపీ శ్రీ రంగరాజన్ గారికి అన్నిరకాలుగా అండగా నిలబడుతుంది మనవిచేస్తున్నాను’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.దాడి ఇలా.. సీఐ పవన్‌కుమార్ కథనం ప్రకారం శుక్రవారం రంగరాజన్ ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి పని చేయాలని, సైన్యాన్ని తయారు చేయాలని కోరారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని, సహకరించకుంటే నిన్ను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. రంగరాజన్ అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో నిందితులు రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు జరిపామని, ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.🚨Great job, Telangana law and order—thriving for all the wrong reasons!What a proud moment for our society—when even a deeply respected figure like Sri Rangarajan garu, the chief priest of Chilkur Balaji Temple and a staunch advocate for Dharma, isn’t spared from goons.… pic.twitter.com/sVeNmCiXus— VoiceofValor (@VoiceofValr) February 10, 2025 -
‘చిలుకూరు బాలాజీ’ అర్చకుడికి బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్ః చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై బెదిరింపులకు పాల్పడడాన్ని టెంపుల్స్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ కన్వీనర్ డాక్టర్ ఎంవీ సౌందర్ రాజన్ ఖండించారు. ఈ మేరకు ఆయన ఆదివారం(ఫిబ్రవరి 9) ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 7న తన కుమారుడు రంగరాజన్‌పై కొందరు బెదిరింపులకు పాల్పడినట్లు సౌందర్ రాజన్ తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై తన కుమారుడు రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సౌందర్ రాజన్ వెల్లడించారు.ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరపాలని సౌందర్‌రాజన్ కోరారు.చిలుకూరి బాలాజీ ఆశీస్సులతోనే తన కుమారుడు క్షేమంగా బయటపడ్డాడడని తెలిపారు. -
గూగుల్‌పై చిల్కూరు పూజారి రంగరాజన్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్‌పై మండిపడుతున్నారు. ఆలయానికి సంబంధించి గూగుల్‌లో చూపిస్తున్న తప్పుడు సమాచారంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. మీడియాతో స్పందించారు.గూగుల్‌లో చిల్కూరు టెంపుల్ అని టైప్ చేస్తే.. కింద శనివారం, ఆదివారం రోజుల్లో గుడి క్లోజ్ అంటూ గూగుల్ సమాచారం చూపిస్తోంది. తిరిగి సోమవారం ఉదయం 8గం.కు తెరుచుకుంటుందని ఉంది. అయితే.. గూగుల్ చూపించే ఆ సమాచరం తప్పుడుదని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వేళలా ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది. గూగుల్ మాత్రమే కాదు.. అలాంటి తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం అని అన్నారాయన.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉంది. వీసా బాలాజీ టెంపుల్‌గా దీనికంటూ ఓ గుర్తింపు ఉంది. విదేశాలకు వెళ్లదల్చుకున్న వాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. శనివారం, సెలవు రోజుల్లో, పండుగల ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వారం రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. -
4న చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత
రంగారెడ్డి: ఏప్రిల్ 4న చంద్రగ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయనున్నారు. శనివారం ఉదయం 9గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 10గంటలకు రథోత్సవం జరగనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ తెలిపారు.