
గన్‌ఫౌండ్రీ: జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహిత పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి 93వ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరికి ఈ నెల 29న విశ్వంభర సినారే జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
ఈ విషయాన్ని సుశీల నారాయణరెడ్డి ట్రస్టు ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాంతా బయోటిక్ ఎండి డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి రచించిన పుస్తకావిష్కరణ, నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.
ఇవి చదవండి: పదునైన రచయిత పసునూరి..