Gunfoundry
-
29న శివశంకరికి ‘సినారే’ పురస్కారం!
గన్‌ఫౌండ్రీ: జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహిత పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి 93వ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరికి ఈ నెల 29న విశ్వంభర సినారే జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.ఈ విషయాన్ని సుశీల నారాయణరెడ్డి ట్రస్టు ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాంతా బయోటిక్ ఎండి డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి రచించిన పుస్తకావిష్కరణ, నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.ఇవి చదవండి: పదునైన రచయిత పసునూరి.. -
‘బడుగుల కోసం పోరాడిన మహానుభావుడు పూలే’
గన్‌ఫౌండ్రీ: విద్యను ఆయుధంగా మార్చుకోవాలని సూచించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని పలువురు ప్రముఖులు కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే 196వ జయంతి వేడుకలను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు జ్యోతిబా పూలే అని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూలే సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీ జనగణనను నిర్వహించాలని డిమాండ్ చేశారు. పలు పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఈనెల 16న ఆన్లైన్ వేదికగా పరీక్షను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి భట్టు మల్లయ్య, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్రచారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్లు ఆనంద్‌కుమార్ గౌడ్, నీల వెంకటేశ్, రాజేందర్, బడేసాబ్ పాల్గొన్నారు. -
గన్‌ఫౌండ్రిలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గన్‌ఫౌండ్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గన్‌ఫౌండ్రిలోని ఓ చెప్పుల గోడౌన్లో మంటలు చెలరేగాయి. తొలుత ఓ హోటల్ కిచెన్‌లో చెలరేగిన మంటలు భారీగా ఎగసిపడటంతో గోడౌన్వైపు వ్యాపించాయి. గోడౌన్‌లోని చెప్పులు, హోటల్లోని ఫర్నిచర్ అగ్నికి ఆహుతైయ్యాయి. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం రెండు ఫైరింజన్లు మంటలార్పుతున్నాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. -
విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి
గన్‌ఫౌండ్రీ: రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. అడవుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అడవుల రక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. రవీంద్రభారతిలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనుమయ మహాసభకు ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ సమతుల్యత లోపించడం వల్ల చేతికివచ్చిన పంట ఇంటికి రావడం లేదన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అటవీ పరిసర ప్రాంతాల్లో విశ్వబ్రాహ్మణులు అటవీశాఖ అధికారులతో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఒక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ...విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ..ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతచారిలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్‌బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంత చారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని, జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణ మనుమయ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గణేషచారి మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలని, ఉప్పల్‌లో కేటాయించిన స్థలంలో భవనాన్ని నిర్మించాలని, కర్రకోత మిషన్లకు లైసెన్స్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, సినీనటుడు నారాయణమూర్తి, మహాసభ సంఘ వ్యవస్థాపకులు గురుచరణంతో పాటు వివిధ జిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ పేరుతో డబ్బు వసూళ్లు
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్) : సివిల్ కాంట్రాక్టర్‌గా చెప్పుకుంటూ అపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తామని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని అఫ్జల్‌గంజ్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్సై కిషన్ కథనం ప్రకారం.. గౌలిగూడకు చెందిన సుబ్రహ్మణ్య రాజు సివిల్ కాంట్రాక్టర్ అవతారమెత్తి అపార్ట్మెంట్లు, ఇండ్లు నిర్మించి ఇస్తానని పలువురి వద్ద అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకున్నాడు. కొంతమేర పనులు చేసినట్లు చూపి రేపు మాపు అంటూ తిప్పుతున్నాడు. ఎవరైనా నిలదీస్తే వారిపై కోర్టు, హెచ్ఆర్సిల్లో భార్యతో కేసులు వేయించి భయపెడుతున్నాడు. ఈ నేపధ్యంలో గౌలిగూడ బస్‌డిపో సమీపంలో ఉండే అశోక్ వద్ద ఇంటి నిర్మాణం కోసం రూ.40 లక్షలకు మాట్లాడుకుని రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. పిల్లర్ల వరకు నిర్మాణం చేపట్టి నిలిపివేశాడు. అలాగే మరో వ్యాపారి వద్ద ఇంటి నిర్మాణానికి రూ.27లక్షలకు మాట్లాడుకొని, రూ.9 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకోని మొదటి అంతస్తు వరకు నిర్మించి నిలిపివేశాడు. వీరు నగదు తిరిగి ఇవ్వాలని కోరగా వాయిదాలు పెడుతున్నాడు. దీంతో బాధితులు అఫ్జల్‌గంజ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు సుబ్రహ్మణ్యరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.