
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గన్‌ఫౌండ్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గన్‌ఫౌండ్రిలోని ఓ చెప్పుల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. తొలుత ఓ హోటల్ కిచెన్‌లో చెలరేగిన మంటలు భారీగా ఎగసిపడటంతో గోడౌన్‌వైపు వ్యాపించాయి. గోడౌన్‌లోని చెప్పులు, హోటల్‌లోని ఫర్నిచర్ అగ్నికి ఆహుతైయ్యాయి. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం రెండు ఫైరింజన్లు మంటలార్పుతున్నాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment