హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు 30% పీఆర్సీ ప్రకటించి సమస్యలను ఒక్కరోజులోనే సాధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ ఉద్యోగుల పక్షాన టీఎన్జీవో అధ్యక్షులు, టీజేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం టీఎన్జీవో భవన్‌లో కేంద్ర కార్యవర్గ సభ్యులు హాజరైన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. టీఎన్జీవో సంఘాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేయడం కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విరివిగా చేపట్టాలని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం అనామలీస్ కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ శాఖల్లో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భద్రాచలం నుంచి బాసర వరకు గద్వాల నుంచి ఆదిలాబాద్ వరకు 33 జిల్లాల్లో కృతజ్ఞతా సభలు నిర్వహించనుండటంతో పాటుగా బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు స్కేలును మంజూరు చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment