బుల్లెట్‌లా పంటలు | CM KCR High Level Meeting With Agriculture Officers | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌లా పంటలు

Published Wed, Oct 14 2020 3:12 AM | Last Updated on Wed, Oct 14 2020 10:06 AM

CM KCR High Level Meeting With Agriculture Officers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఏడాదిలో తెలంగాణ మొత్తం పచ్చబడుతుంది. చాలా అద్భుతాన్ని చూడబోతున్నం. మిషన్‌ కాకతీయ, నిరంతర ఉచిత విద్యుత్, కాళేశ్వ రం తదితర ప్రాజెక్టులతో మన వ్యవసాయం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 4 లక్షల టన్నుల నుంచి 24 లక్షల టన్నుల సామర్థ్యానికి గోదాముల నిల్వసామర్థ్యం పెంచాం. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లా ఇప్పుడు అత్యధిక వర్షపాతం కలిగిన జిల్లాగా మారిపోయింది. ఇతర జిల్లాల నుంచే ఇక్కడికి వ్యవసాయ కూలీలు వలస వస్తున్నరు. పాలమూరు వ్యవసాయ అభివృద్ధి, రాష్ట్ర వ్యవసాయ ప్రగతికి నిదర్శనం.

యాసంగిలో 70 లక్ష ల ఎకరాల్లో సాగు కానుందని అధికారు లు రిపోర్టులు సిద్ధం చేశారంటే, తెలంగా ణ వ్యవసాయం దేశంలోనే నంబర్‌ వన్‌ స్థాయికి చేరుకున్నట్లు. ఇక నుంచి తెలంగాణలో పంటలు బుల్లెట్లలా దూసుకువస్తాయి. సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోతే వ్యవసాయశాఖకు ఇబ్బందులు తప్పవు’అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. నియంత్రిత సాగు అమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయ ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, పంటల కు మార్కెటింగ్‌ నిర్వహించే బాధ్యత వ్యవసాయ శాఖపై ఉందని స్పష్టం చేశా రు. జిల్లా, రాష్ట్రస్థాయి వ్యవసాయ అధికారులతో మంగళవారం ఆయన ప్రగతి భవన్‌ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.  

మక్కలకు విరామం ఇవ్వాల్సిందే..     
‘మక్కలకు గిట్టుబాటు ధర రాదు అని తేల్చి చెప్పండి. అయినా పండిస్తం అంటే ఇక రైతుల ఇష్టం’అని స్పష్టం చేశారు.

సిమెంట్‌ ఫ్లోర్లపై సాగు... 
‘జనాభా పెరుగుతున్నది గాని భూమి పెరగడం లేదు. భవిష్యత్‌లో సిమెంట్‌ ఫ్లోర్ల మీద వ్యవసాయం చేసే పరిస్థితి రాబోతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నరు. వ్యవసాయ రంగం జీడీపీకి తక్కు వ కంట్రిబ్యూట్‌ చేస్తుందనేది చాలా డొల్ల వాదన. ప్రపంచానికే విత్తనాలను అమ్ము తున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోంది. గుజరాత్‌ వ్యాపారులు మన పత్తిని కొంటున్నరు. తెలంగాణ సోనా బియ్యా న్ని డయాబెటిక్‌ రోగులు తినవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు అక్కడి పత్రికల్లో ప్రచురించారు. ఏ పంట వేయాలి.. ఏ పంట వేయకూడదనే విధానాలను రూ పొందించి ‘డూస్‌ అండ్‌ డోంట్‌ డూస్‌’ గురించి వివరిస్తూ వచ్చే ఏడాది నుంచే ‘అగ్రికల్చ ర్‌ కార్డు’ను పంపిణీ చేసేలా అధికారులు సన్నద్ధం కావాలి’అని సీఎం సూచించారు. వ్యవసాయ శాఖలో తక్షణమే ఖాళీల భర్తీతో పాటు పెండింగ్‌ పదోన్నతులు కల్పించాలని మంత్రి నిరంజన్‌ రెడ్డిని సీఎం ఆదేశించారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులే అయితే ఒకే చోట పనిచేసేలా బదిలీ చేయాలని కోరారు.

దేశానికే ఆదర్శం..
‘మన రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలనే కాకుండా కేంద్రాన్ని కూడా ప్రభావితం చేశా యి. రాష్ట్ర ప్రజలు ఏమి తింటున్నారో.. మార్కెట్లో ఏ పంటకు ధర వస్తుందో తెలుసుకొని అందుకు అనుగుణంగా పంటలను పండించాలి. రాష్ట్రంలో సర్వే చేయిస్తే ఒకప్పుడు గ్రామాల్లో ఉచితంగా దొరికే చింతపండుకు లోటు ఏర్పడిందని తేలింది. 58 వేల టన్నుల చింతపండును ప్రజలు వినియోగిస్తారని తెలిసింది. అటవీ శాఖను అప్రమత్తం చేసి భారీ స్థాయిలో చింతచెట్లను నాటించిన’అని సీఎం తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement