High level meeting
-
తీవ్ర తుపానుగా రెమాల్.. ప్రధాని హై లెవెల్ మీటింగ్
సాక్షి, ఢిల్లీ: రెమాల్ తుపానుపై ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. వెస్ట్ బెంగాల్లో తీరం దాటనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వెస్ట్ బెంగాల్‌కు జాతీయ విపత్తు దళం ద్వారా అన్ని రకాల సహాయం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు.తీవ్ర తుపానుగా బలపడిన ‘రెమాల్’ ఈరోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తుపాను ప్రభావంతో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. -
రాష్ట్రంలో ప్రతిఏటా ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు నిర్వహించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన.. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష..ఇంకా ఇతర అప్డేట్స్
-
AP: కృష్ణాజలాలపై హైలెవల్ మీటింగ్
సాక్షి, గుంటూరు: కృష్ణాజలాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జలాలపై కేంద్రం తాజా విధివిధానాల జారీ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఈ సమావేశం నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. నదీజలాల పంపిణీపై గతంలో ఇచ్చిన కేటాయింపులపై ఈ సందర్భంగా సమగ్రంగా చర్చించారు సీఎం జగన్. అంతేకాదు.. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. KWDT-2 తీర్పుద్వారా.. మిగులు జలాల కేటాయింపుల్లోనూ నష్టం జరిగిన అంశంపైనా ఈ భేటీలో చర్చించారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమని, రాష్ట్ర విభజన చట్టాన్ని మీరి ఈ మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని, ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్ ఉండగా కూడా గెజిట్ విడుదలచేశారని అధికారులు ప్రస్తావించారు. 2002కు ముందు చేసిన ట్రైబ్యునల్ కేటాయింపులను, పంపకాలను పునఃపరిశీలించరాదని చట్టం చెప్తున్నా.. దీనికి విరుద్ధంగా కేంద్రం విధివిధానాలు చేసిందని అధికారులు వివరించారు. దీంతో.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని.. ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ భేటీలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు, పలువురు న్యాయ నిపుణులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: కృష్ణా జలాలపై ప్రధానికి సీఎం జగన్ లేఖ -
గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం
హైదరాబాద్: వచ్చే నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ఉదయం 11.00 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి లు పాల్గొంటారు. అంతేకాకుండా బాలాపూర్, ఖైరతాబాద్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సికింద్రాబాద్ YMCA గణేష్ ఉత్సవ సమితిలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గణేష్ మండపాల నిర్వహకులకు కూడా సమావేశానికి ఆహ్వానిస్తూ అధికారులు లేఖలను పంపించారు. గణేష్ నవరాత్రుల నిర్వహణ లో దేశంలోనే హైదరాబాద్ నగరం ప్రత్యేకతను సంతరించుకుంది. అటువంటి గణేష్ నవరాత్రులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత మరింత ఘనంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తూ వస్తోంది. విగ్రహాల ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా శాంతిభద్రతల నిర్వహణ, శోభాయాత్ర, వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ వస్తోంది. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇదీ చదవండి: TS: డ్రగ్స్ కేసులో ఎస్ఐ రాజేందర్ అరెస్ట్ -
‘జోషిమఠ్’పగుళ్లపై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పట్టణంగా పేరున్న జోషిమఠ్( చమోలీ జిల్లా)లో భూభాగం కుంగిపోతూ వస్తోంది. వందల సంఖ్యలో ఇళ్లకు బీటలువారాయి. సుమారు 600 కుటుంబాలను ఖాళీ చేసేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జోషిమఠ్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చింది ప్రధానమంత్రి కార్యాలయం. కేబినెట్ సెక్రెటరీ సహా కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ విభాగం అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రెటరీ పీకే మిశ్రా సమీక్ష నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ ఉన్నతాధికారులతో పాటు జోషిమఠ్ జిల్లా అధికారులు సైతం హాజరుకానున్నారు. జోషిమఠ్‌లో భూమి కుంగిపోయి ఇళ్లకు బీటలు వస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. శనివారం జోషిమఠ్‌లో పర్యటించారు. ప్రభావితమైన 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జోషిమఠ్ ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: Joshimath Sinking: జోషీ మఠ్‌లో వందలాది ఇళ్లకు పగుళ్లు.. తక్షణం 600 కుటుంబాలు ఖాళీ! ఏమిటీ జోషీమఠ్ ? -
WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్ సైన్యం
ముంబై: ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ఆదివారం బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆటగాళ్లకు కఠిన పరీక్ష పెట్టే యో–యో ఫిట్నెస్ టెస్టును తిరిగి ప్రవేశ పెట్టనున్నారు. ప్రత్యేకించి ఈ ఏడాది వరల్డ్‌కప్‌తో పాటు, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కూడా ఉండటంతో భారత ప్రపంచకప్ సైన్యంపై అదనపు ఒత్తిడి, క్రికెట్ భారం లేకుండా పక్కా ప్రణాళికతో సిరీస్‌లకు ఎంపిక చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ► బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో బోర్డు కార్యదర్శి జై షా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ పాల్గొన్నారు. బిన్నీ మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. ► కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ ఇలా గత కొంతకాలంగా భారత కెప్టెన్లను మార్చినప్పటికీ పూర్తిస్థాయి సారథిగా రోహిత్ శర్మనే కొనసాగించాలని తీర్మానించారు. తద్వారా సారథ్య మార్పు ఉండదని స్పష్టం చేశారు. ► మెగా టోర్నీ, మేటి జట్లతో సిరీస్‌ల నేపథ్యంలో జట్టు సెలక్షన్ కోసం యో–యో టెస్టు, డెక్సా (ఎముకల పరిపుష్టి పరీక్ష) టెస్టుల్ని నిర్వహిస్తారు. ఎంపికవ్వాలంటే ఈ టెస్టులు పాసవ్వాలి. ► ఎమర్జింగ్ ప్లేయర్లు ఐపీఎల్‌తో పాటు ప్రాధాన్యత గల దేశవాళీ టోర్నీల్లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్న వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారు. ► ప్రపంచకప్‌కు ఎంపికయ్యే క్రికెటర్లంతా పూర్తి ఫిట్నెస్తో మెగా ఈవెంట్‌కు అందుబాటులో ఉండేలా చూడటమే ప్రాధాన్య అంశంగా భేటీ జరిగింది. ఆటగాళ్లపై బిజీ షెడ్యూల్ భారం, ఒత్తిడి, మెంటల్ కండిషనింగ్, ఫిట్నెస్ అంశాల్ని ఇందులో చర్చించారు. ► మంచి ఆల్‌రౌండర్ అవుతాడనుకున్న దీపక్ చహర్, భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచూ గాయాల పాలవడంపై చర్చించిన మీదట ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ► అవసరమైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలతో కూడా బోర్డు పెద్దలు మాట్లాడతారు. ఈ ఏడాది భారత క్రికెట్‌కు అత్యంత కీలకం కాబట్టి ఆయా ఫ్రాంచైజీలు ఐపీఎల్ టోర్నీ సమయంలో తమ స్టార్ ఆటగాళ్లపై పెనుభారం మోపకుండా చూస్తారు. ► గతంలో కోహ్లి కెప్టెన్సీ హయాంలో యో–యో టెస్టు వార్తల్లో నిలిచింది. అయితే ఇది స్టార్, ఎలైట్ ఆటగాళ్లను కష్టపెట్టడంతో తాత్కాలికంగా యో–యో టెస్టును పక్కన పెట్టారు. ► ఆస్ట్రేలియాలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్ వైఫల్యం దరిమిలా తొలగించిన సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ఈ కీలక మీటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. 20 మందితో ప్రపంచకప్ సైన్యం... సొంతగడ్డపై ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరిగే ప్రపంచకప్ కోసం 20 మందితో కూడిన జాబితాను సిద్ధం చేశారు. మెగా టోర్నీ జరిగేదాకా వీరందరూ కూడా ఒకే టోర్నీలో బరిలోకి దిగరు. రొటేషన్ పద్ధతిలో ఆడతారు. కొందరికి విశ్రాంతి... ఇంకొందరు బరిలోకి అన్నట్లుగా ఈ పద్ధతి సాగుతుంది. గాయాల పాలవకుండా, మితిమీరిన క్రికెట్ భారం పడకుండా ఉండేందుకు బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి రజని ఉన్నతస్థాయి సమీక్ష
-
తవాంగ్ ఘర్షణ: రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికల నడుమ తలెత్తిన ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిద ధళాల అధిపతులు, విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 9న జరిగిన ఘటనపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. సరిహద్దులో ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్‌లోనూ ఈ అంశంపై రాజ్‌నాథ్ మాట్లాడనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: భారత్-చైనా సరిహద్దు ఘర్షణ.. ప్రతిపక్షాలకు పార్లమెంట్లో గట్టి కౌంటర్ పడేనా? -
Monkeypox: మంకీపాక్స్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ హైలెవల్ మీటింగ్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జరనల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరిగింది. మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మరునాడే సమావేశం జరగడం గమనార్హం. ఈ భేటీలో మంకీపాక్స్ నివారణకు, ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో మరో కొత్త వ్యాధి వెలుగుచూస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఢిల్లీలో ఆదివారం నమోదైన కొత్త కేసుతో కలిపి దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే తాజాగా ఈ వ్యాధి సోకిన 34 ఏళ్ల వ్యక్తికి విదేశాల్లో పర్యటించిన చరిత్ర లేదు. జ్వరం, చర్మంపై దద్దుర్లతో రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేరాడు. శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా.. ఆదివారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. ఈ వ్యక్తికి ప్రత్యేక శిబిరంలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. అంతకుముందు నమోదైన మూడు మంకీపాక్స్ కేసులు కేరళలోనే వెలుగుచుశాయి. వీరిలో ఇద్దరు యూఏఈలో పర్యటించగా.. ఒకరు దుబాయ్ నుంచి వచ్చారు. మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా శనివారం ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. అన్ని దేశాలు అప్రమత్తమై తక్షణమే వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించింది. అంతర్జాతీయ సమాజమంతా ఏకమై ఈ వ్యాధిపై పోరాడాలని, వ్యాక్సిన్లు, మందుల సాయం అందించుకోవాలని పేర్కొంది. చదవండి: సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్ -
కశ్మీర్లో వరుస ఉగ్రదాడులు.. అమిత్‌షా ఉన్నతస్థాయి సమావేశం
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో హిందువులపై జరుగుతున్న వరుస హత్యల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అమిత్ షా అధ్యక్షతన శుక్రవారం ఉన్నతస్థాయి భద్రతా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జమ్ము కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్, ఆర్ అండ్ ఏడబ్ల్యూ చీఫ్ సమంత్ సమంత్ గోయల్ హాజరయ్యారు. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు, పౌరుల భద్రత, ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు అమలు చేసే వ్యూహాలపై సమీక్షించారు. కాగా జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో గత కొన్ని నెలలుగా హిందువులను లక్ష్యంగా చేసుకొని వరుస హత్యలు జరగుతున్నాయి. మే 1 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది లక్షిత హత్యలు జరిగాయి. గురువారం బీహార్‌కు చెందిన దిల్ఖుష్ కుమార్ (17) అనే కార్మికుడు బుద్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. అదే రోజు కుల్గామ్‌లో రాజస్థాన్‌కు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి హత్యకు గురయ్యాడు. అంతకు ముందు గోపాల్‌పొర ప్రాంతంలోని ఓ పాఠశాలలో చొరబడిన ఉగ్రవాదులు అక్కడ పనిచేస్తోన్న రజిని బాలా అనే ఉపాధ్యాయురాలిని కాల్చి చంపారు. అయితే ఇటీవల జరిగిన దాడులను నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళనలను నిర్వహిస్తున్నారు. కశ్మీర్ నుంచి వారిని జమ్మూకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో కాశ్మీర్ లోయలోని 350 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, కాశ్మీరీ పండిట్లందరూ మనోజ్ సిన్హాకు రాజీనామాలు సమర్పించారు. చదవండి: ఆర్యసమాజ్‌లో వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
ఉగ్రకాండ.. అమిత్ షా మీటింగ్ ముందర మరొకటి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మైనార్టీలపై వరుస ఉగ్రదాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో హిందూ కమ్యూనిటీ వ్యక్తిని కాల్చిచంపారు ముష్కరులు. కుల్గాంలోని ఆరే మోహన్పురలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. కశ్మీర్ వరుస కాల్పుల ఘటనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. శుక్రవారం హైలెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంతకంటే ముందే మరొ ఘటన జరగడం విశేషం. మృతుడిని ఎలఖాహీ డెహతి బ్యాంక్ మేనేజర్ విజయ్‌కుమార్‌గా గుర్తించారు. ఆయన స్వస్థలం రాజస్థాన్ హనుమాన్‌గఢ్. రెండు రోజుల కిందట ప్రభుత్వ టీచర్ రజనీ బాలా(36) ముష్కరులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రాహుల్ భట్ మరణం.. నిరసనలతో పాటు రాజకీయంగానూ దుమారం రేపింది. ఈ మధ్యలో ఓ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ కూడా దారుణ హత్యకు గురైంది. ఇదిలా ఉంటే.. కశ్మీర్లో వరుసగా హిందువులపై ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో వాళ్ల భద్రత విషయంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ వర్గాల తరపున అక్కడి పార్టీలన్నీ కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. మరోవైపు కశ్మీర్ పండిట్లు సైతం.. తమను బలవంతంగా తీసుకొచ్చి ఉగ్రవాదుల చేతిలో చంపిస్తున్నారంటూ కేంద్రంపై మండిపడుతున్నారు. కశ్మీర్ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. శుక్రవారం హైలెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంతకంటే ముందే ఈ ఘటన జరగడం విశేషం. ఈ భేటీలో షాతో పాటు కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హాజరుకానున్నారు. కశ్మీర్లో వరుసగా జరుగుతున్న ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు ఎల్జీ. కేంద్రం హోం కార్యదర్శి అజయ్ భల్లా, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్సింగ్, బీఎస్ఎఫ్ చీఫ్ పంకజ్ సింగ్.. ఈ భేటీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: కశ్మీరీ పండిట్ల ఆవేదనే బీజేపీకి ఆయుధమా? -
దేశ భద్రత పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
-
కోవిడ్‌పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ నిర్వహణ, వ్యాక్సినేషన్, పెరుగుతున్న కేసులు వంటి వాటిపై ప్రధాని మోదీ శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పీడియాట్రిక్ కేర్ (చిన్నారుల ఆరోగ్య వ్యవస్థ)కు సంబంధించి పడకల వివరాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో పడకలు ఏర్పాటు చేసేలా కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని అధికారులు మోదీకి వ్యవరించారు. దీంతో పాటు కోవిడ్ మందుల అందుబాటు, నిల్వలపై రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన వ్యవహారం కూడా మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో మహారాష్ట్ర, కేరళలతో పాటు ప్రపంచంలో కూడా కేసులు పెరుగుతున్న వైనాన్ని సమావేశంలో చర్చించారు. ఆక్సిజన్ అందుబాటు, కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లు, పీఎస్ఏ ప్లాంట్లు వంటి వివరాల గురించి మోదీ ఆరా తీశారు. కనీసం జిల్లాకొకటి చొప్పున దేశంలో ఇన్స్టాల్ చేయనున్న 961 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు, 1450 మెడికల్ గ్యాప్ పైప్‌లైన్ సిస్టం గురించి సమావేశంపై విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించారు. -
కశ్మీర్‌పై అమిత్‌షా ప్రత్యేక భేటీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో అమలవుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ భేటీలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు ఎన్ఎస్ఏ (జాతీయ భద్రతా సలహాదారు) అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) డైరెక్టర్ అర్వింద్ కుమార్, రా (రీసెర్చి అండ్ అనాలిసిస్ వింగ్) చీఫ్ సామంత్ కుమార్ గోయెల్, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్, కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని అమిత్ షా ఈ సందర్భంగా అన్నారు. కశ్మీర్లో కోవిడ్ వ్యాక్సినేషన్ 76% వరకు పూర్తి చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఆయన అభినందనలు తెలిపారు. కశ్మీర్‌లోని నాలుగు జిల్లాల్లో 100% వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. పీఎం కిసాన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులు తదితర పథకాల ప్రయోజనాలను కశ్మీర్ ప్రాంత రైతులకు అందేలా చూడాలని అమిత్ షా కోరారు. పారిశ్రామిక విధానం ప్రయోజనాలను చిన్న తరహా పరిశ్రమలు అందుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఎన్నికైన పంచాయతీ సభ్యులకు శిక్షణ అందించాలనీ, దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన పంచాయతీల్లో వారు పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. -
ప్రతి పౌరుడికీ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పౌరుడికీ కోవిడ్–19 వ్యాక్సిన్ తప్పనిసరిగా అందేలా పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎన్నికలు, విపత్తుల సమయాల్లో మాదిరిగానే టీకా పంపిణీలో కూడా అన్ని స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం, పౌర సమాజాలు పాలుపంచుకోవాలన్నారు. దేశంలో కోవిడ్–19 పరిస్థితి, టీకా సరఫరా, పంపిణీకి చేపట్టిన ఏర్పాట్లపై ప్రధాని మోదీ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశ విస్తీర్ణం, జనాభా, భౌగోళిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ప్రతిపౌరుడికీ టీకా వేగంగా అందేలా చూడాలన్నారు. ‘టీకా రవాణా, పంపిణీ, నిర్వహణ యంత్రాంగాలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ నిల్వకు అవసరమైన పర్యవేక్షణ యంత్రాంగం, కోల్డ్‌స్టోరేజీ ఏర్పాట్లు, పంపిణీ, వయల్స్, సిరంజీల వంటివి అందుబాటులో ఉంచడం, అవసరాలను ముందుగానే గుర్తించి స్పందించే వ్యవస్థలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి’అని ప్రధాని తెలిపారు. దేశంలో రోజువారీ కేసులు, కేసుల్లో పెరుగుదల రేటు తగ్గుతోందన్న ప్రధాని.. ఈ సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం తగదన్నారు. మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నాలను కొనసాగించాలన్నారు. ఈ రానున్న పండగ సీజన్లో మాస్కు ధరించడం, చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత పాటించడం వంటివి తప్పనిసరిగా కొనసాగించాలని కోరారు. దేశంలో అభివృద్ధి చేస్తున్న మూడు టీకాల్లో రెండో దశ ట్రయల్స్‌లో రెండు, మూడో దశలో ఒక టీకా ఉన్నాయని చెప్పారు. ‘పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల శాస్త్రవేత్తలతో మన శాస్త్రవేత్తలు సమన్వయం చేసుకుంటూ పరిశోధన సామర్థ్యాన్ని మెరుగు పరుచుకుంటున్నారు. బంగ్లాదేశ్, మయన్మార్, ఖతార్, భూటాన్ తమ దేశాల్లో కూడా క్లినికల్ ట్రయల్స్ చేపట్టాలని కోరుతున్నాయి. ఇరుగుపొరుగు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలకు కూడా కోవిడ్ టీకా, ఔషధాల విషయంలో సాయపడాలి’అని అన్నారు. ఆ అనుభవాన్ని ఉపయోగించుకోవాలి ‘దేశంలో ఎన్నికలు, విపత్తు సమయాల్లో విజయవంతంగా పనిచేసిన అనుభవాన్ని టీకా పంపిణీ, సరఫరాలో కూడా ఉపయోగించుకోవాలి. టీకా పంపిణీలో కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల జిల్లా స్థాయి యంత్రాంగాలు, పౌర సమాజాలు, వలంటీర్లు, సంబంధిత రంగాల నిపుణుల భాగస్వామ్యం అవసరం ఉంది. ఐటీ సాంకేతికత వెన్నుదన్నుతో రూపుదిద్దుకునే ఈ పంపిణీ వ్యవస్థ మన ఆరోగ్య రంగానికే తలమానికంగా నిలవాలి’అని పేర్కొన్నారు. 19న ‘గ్రాండ్ చాలెంజెస్’ ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే గ్రాండ్ చాలెంజెస్ వార్షిక సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు. ఆరోగ్యం, అభివృద్ధి విషయాల్లో ప్రపంచ సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనడం ఈ భేటీ లక్ష్యం. ‘ప్రపంచం కోసం భారత్’అంశంపై ఈ సమావేశం ప్రత్యేక దృష్టి సారించనుంది. ప్రజాప్రతినిధులు, శాస్త్రీయ రంగాల ప్రతినిధులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాలు కొనసాగుతాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో దాదాపు 40 దేశాలకు చెందిన 1,600 మంది పాల్గొంటారు. ఈ సమావేశాలు గత 15 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ మ్యుటేషన్ లేదు దేశంలో కరోనా వైరస్ జన్యుపరంగా స్థిరంగా ఉందనీ, ఎటువంటి మ్యుటేషన్‌కు గురికాలేదని తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అధికారులు ప్రధానికి తెలిపారు. వైరస్‌లో మ్యుటేషన్ సంభవిస్తే టీకా అభివృద్ధిపై అది ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలి కాలంలో కరోనా వైరస్‌లో చోటుచేసుకున్న మ్యుటేషన్లు వివిధ దేశాల్లో కొనసాగుతున్న టీకాల రూపకల్పనపై ఎటువంటి ప్రభావం చూపబోదని అంతర్జాతీయ సంస్థల అధ్యయనాల్లోనూ రుజువయింది. వైరస్‌లో సంభవించే కొన్ని మార్పులతో వైరస్ వ్యాప్తి వేగవంతం అవుతుందనే అంచనాలున్నాయి. దాదాపు 72 దేశాల్లో సంభవించిన కరోనా వైరస్ జెనోమ్ మ్యుటేషన్లతో భారత్‌లోని 5.39 శాతం మ్యుటేషన్లకు పోలికలున్నట్లు కూడా గత నెలలో ఓ శాస్త్రవేత్తల బృందం తెలిపిందని వారు చెప్పారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. -
బుల్లెట్లా పంటలు
సాక్షి, హైదరాబాద్: ‘ఏడాదిలో తెలంగాణ మొత్తం పచ్చబడుతుంది. చాలా అద్భుతాన్ని చూడబోతున్నం. మిషన్ కాకతీయ, నిరంతర ఉచిత విద్యుత్, కాళేశ్వ రం తదితర ప్రాజెక్టులతో మన వ్యవసాయం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 4 లక్షల టన్నుల నుంచి 24 లక్షల టన్నుల సామర్థ్యానికి గోదాముల నిల్వసామర్థ్యం పెంచాం. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లా ఇప్పుడు అత్యధిక వర్షపాతం కలిగిన జిల్లాగా మారిపోయింది. ఇతర జిల్లాల నుంచే ఇక్కడికి వ్యవసాయ కూలీలు వలస వస్తున్నరు. పాలమూరు వ్యవసాయ అభివృద్ధి, రాష్ట్ర వ్యవసాయ ప్రగతికి నిదర్శనం. యాసంగిలో 70 లక్ష ల ఎకరాల్లో సాగు కానుందని అధికారు లు రిపోర్టులు సిద్ధం చేశారంటే, తెలంగా ణ వ్యవసాయం దేశంలోనే నంబర్ వన్ స్థాయికి చేరుకున్నట్లు. ఇక నుంచి తెలంగాణలో పంటలు బుల్లెట్లలా దూసుకువస్తాయి. సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోతే వ్యవసాయశాఖకు ఇబ్బందులు తప్పవు’అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. నియంత్రిత సాగు అమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, పంటల కు మార్కెటింగ్ నిర్వహించే బాధ్యత వ్యవసాయ శాఖపై ఉందని స్పష్టం చేశా రు. జిల్లా, రాష్ట్రస్థాయి వ్యవసాయ అధికారులతో మంగళవారం ఆయన ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. మక్కలకు విరామం ఇవ్వాల్సిందే.. ‘మక్కలకు గిట్టుబాటు ధర రాదు అని తేల్చి చెప్పండి. అయినా పండిస్తం అంటే ఇక రైతుల ఇష్టం’అని స్పష్టం చేశారు. సిమెంట్ ఫ్లోర్లపై సాగు... ‘జనాభా పెరుగుతున్నది గాని భూమి పెరగడం లేదు. భవిష్యత్‌లో సిమెంట్ ఫ్లోర్ల మీద వ్యవసాయం చేసే పరిస్థితి రాబోతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నరు. వ్యవసాయ రంగం జీడీపీకి తక్కు వ కంట్రిబ్యూట్ చేస్తుందనేది చాలా డొల్ల వాదన. ప్రపంచానికే విత్తనాలను అమ్ము తున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోంది. గుజరాత్ వ్యాపారులు మన పత్తిని కొంటున్నరు. తెలంగాణ సోనా బియ్యా న్ని డయాబెటిక్ రోగులు తినవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు అక్కడి పత్రికల్లో ప్రచురించారు. ఏ పంట వేయాలి.. ఏ పంట వేయకూడదనే విధానాలను రూ పొందించి ‘డూస్ అండ్ డోంట్ డూస్’ గురించి వివరిస్తూ వచ్చే ఏడాది నుంచే ‘అగ్రికల్చ ర్ కార్డు’ను పంపిణీ చేసేలా అధికారులు సన్నద్ధం కావాలి’అని సీఎం సూచించారు. వ్యవసాయ శాఖలో తక్షణమే ఖాళీల భర్తీతో పాటు పెండింగ్ పదోన్నతులు కల్పించాలని మంత్రి నిరంజన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులే అయితే ఒకే చోట పనిచేసేలా బదిలీ చేయాలని కోరారు. దేశానికే ఆదర్శం.. ‘మన రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలనే కాకుండా కేంద్రాన్ని కూడా ప్రభావితం చేశా యి. రాష్ట్ర ప్రజలు ఏమి తింటున్నారో.. మార్కెట్లో ఏ పంటకు ధర వస్తుందో తెలుసుకొని అందుకు అనుగుణంగా పంటలను పండించాలి. రాష్ట్రంలో సర్వే చేయిస్తే ఒకప్పుడు గ్రామాల్లో ఉచితంగా దొరికే చింతపండుకు లోటు ఏర్పడిందని తేలింది. 58 వేల టన్నుల చింతపండును ప్రజలు వినియోగిస్తారని తెలిసింది. అటవీ శాఖను అప్రమత్తం చేసి భారీ స్థాయిలో చింతచెట్లను నాటించిన’అని సీఎం తెలిపారు. -
సడలింపులు వేటికో?
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణకు రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు సంబంధించిన భవిష్యత్తు వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రం ప్రకటిం చిన సడలింపుల్లో ఇప్పటికే రాష్ట్రంలో కొన్నిం టిని అమలు చేస్తున్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో నియంత్రిత పద్ధతిలో చాలావరకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించింది. హైదరాబాద్, రంగారెడ్డి తదితర రెడ్ జోన్ జిల్లాల్లో మాత్రం ఆంక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి. రెడ్ జోన్ జిల్లాల్లో కొన్ని సడలింపులకు అనుమతి ఇచ్చే విషయంపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ మినహా ఇతర రెడ్ జోన్ జిల్లాల్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అక్కడ కొంత వరకు ఆంక్షలు సడలించే అవకాశం ఉంది. అలాగే కేంద్రం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల మేరకు ఇతర రాష్ట్రాల్లో చాలా వరకు సడలింపులిచ్చారు. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందిందా..? అన్న విషయాన్ని సమీక్షించి రాష్ట్రంలో కూడా సడలింపుల అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించనున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు వంటి ప్రజారవాణా పునరుద్ధరణపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అమలు చేయాల్సిన వ్యూహాన్ని ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. వలస కార్మికులకు సంబంధించిన సమస్యలను సైతం పరిశీలించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెలలో పూర్తి స్థాయి వేతనాలు చెల్లించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ విషయాన్ని సైతం ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కరోనా ఇప్పట్లో తగ్గుముఖం పట్టదని, ఈ వైరస్‌తో కలసి బతికేందుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో దీనికి సంబంధించిన నివేదికను అధికారులు ప్రభుత్వం ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయి. దీని ఆధారంగా ఈ సమీక్షలో నిర్ణయాలు తీసుకోనున్నారు. సమీక్ష ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. -
బాధితులకు అండగా ఉంటాం: మంత్రులు
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు అండగా ఉంటామని మంత్రులు తెలిపారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై వారి ఆధ్వర్యంలో అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, సీఎస్ నీలంసాహ్ని, కలెక్టర్ వినయ్‌చంద్, సీపీ ఆర్కే మీనా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు కల్పించి.. అండగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని మంత్రులు తెలిపారు. గ్యాస్ లీకేజీ బాధితులకు మంచి ఆహారం అందించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. (ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కేసు నమోదు) లీకేజీ గ్రామాలలో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. బాధితులకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ‘‘మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా బాసటగా ఉంటుంది. గ్యాస్ లీకేజీ ఘటన పై అధ్యయన కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది. ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం కల్పించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాలని సీఎం తెలిపారు. జంతు నష్టం పై కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని’’ ఆళ్ల నాని వెల్లడించారు. (నాడు డిమాండ్ చేశారు: నేడు ఆచరించారు) -
అవగాహనతోనే వేధింపులకు చెక్
సాక్షి, హైదరాబాద్ : మహిళల భద్రత–రక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, అప్పుడే వేధింపుల నివారణ సాధ్యమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ‘దిశ’ఘటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం హోంమంత్రి కార్యాలయంలో పలువురు మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారు. మహిళల భద్రతకు అనుసరించాల్సిన వ్యూహాలు, వారిపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం చర్చించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ– షీటీమ్స్ స్వాతి లక్రా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే.. మహిళలు అదృశ్యమైన కేసుల్లో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే కేసులు నమోదు చేయాలి. పోలీస్స్టేషన్ల పరిధులతో సంబంధం లేకుండా ముందు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలి. షీటీమ్స్ మరింత బలోపేతానికి హాక్ ఐ వినియోగాన్ని పెంచేలా ప్రోత్సహించాలి. హెల్ప్లైన్లు, పోలీసు యాప్స్ వినియోగం పెరిగే లా మహిళల్లో అవగాహన కల్పించాలి. డయల్ 100, 181, 1098, 112 హెల్ప్‌లైన్ నెంబర్లను విద్యాసంస్థల్లో ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే, మెట్రో, పార్కులు, ఆటో, క్యాబ్‌ల్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ ప్రదర్శించాలి. బాలబాలికలు, ఉద్యోగులకు వేధింపులు లింగసమానత్వంపై అవగాహన తీసుకువచ్చేందుకు ఈ–లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి తేవాలి. సినిమాహాళ్లు, టీవీల్లో లఘుచిత్రాలు, స్లైడ్లు ప్రదర్శించాలి. షీటీమ్స్‌తో కలిసి విద్యాసంస్థల్లో అమ్మాయిలపై వేధింపులపై అవగాహన కల్పించే సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ. గ్రామం నుంచి జిల్లా స్థాయివరకు అంగన్వాడీ, ఆశా, సెర్ఫ్ తదితర సంఘాలను మహిళా భద్రతపై ప్రచారానికి వినియోగించాలి. పిల్లలు నడుచుకుంటున్న విధానంపై తల్లిదండ్రులతో స్కూలు ఉపాధ్యాయులు చర్చించాలి. -
తేడా వస్తే తాట తీయండి..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సరిహద్దుల్లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ శిక్షణ శిబిరాలపై భారత్ దాడి చేసిన అనంతరం దేశ భద్రతపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్‌లతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారత్–పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడితే సమర్థవంతంగా తిప్పికొట్టాలని హోం శాఖ ఆదేశించింది. ఇవిగో రుజువులు.. పుల్వామా దాడికి జైషే మహ్మదే కారణం న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో జైషే మహ్మద్ పాత్ర ఉందని చూపే ఆధారాలతోపాటు, పాక్‌లో నడుస్తున్న నిషేధిత ఉగ్ర సంస్థల వివరాలను భారత్ పాకిస్తాన్‌కు అందజేసింది. ‘పుల్వామా ఉగ్రదాడిలో జైషే మహ్మద్ హస్తం ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలతోపాటు ఆ ఉగ్ర సంస్థ నేతలు, స్థావరాల వివరాలను పాక్‌కు అందజేశాం’అని విదేశాంగ శాఖ తెలిపింది. పాక్ తన భూభాగంలో కొనసాగుతున్న ఉగ్ర కార్యకలాపాలను తక్షణమే అడ్డుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొంది. అమెరికా చేసిన పని మనమూ చేయగలం న్యూఢిల్లీ: భారత్‌పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను 2011లో అమెరికా దాడిచేసి మట్టుబెట్టిందని, భారత్‌కు అటువంటి సత్తా ఉందన్నారు. స్వచ్ఛగంగ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ లో మాట్లాడారు. ‘ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే నాకో విషయం గుర్తుకొస్తోంది. అబోటాబాద్‌లోని రహస్య స్థావరంలో దాక్కొన్న లాడెన్‌ను అమెరికన్ నేవీ షీల్స్ చాకచ క్యంగా మట్టుబెట్టగలిగినప్పుడు మనమెందుకు ఆ పని చేయలేం? గతంలో ఇటువంటి దా డులు కేవలం మన ఊహలకు మాత్రమే పరిమితమయ్యేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. శత్రువు ఎక్కడున్నా మట్టుబెట్టే సామర్థ్యం భారత్‌కూ ఉంది’అని జైట్లీ అన్నారు. -
పన్నీర్ సెల్వం ఏం చర్చించారో?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి అనూహ్యంగా తప్పుకున్న ఒ పన్నీర్ సెల్వం భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. తన నివాసంలో ఆదివారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తనకు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే ఎంపీలతో ఆయన మంతనాలు జరిపారు. జయలలిత మృతిపై దర్యాప్తు చేపట్టకపోతే మార్చి 8న తన మద్దతుదారులు, పార్టీ నేతలతో కలిసి నిరాహార దీక్షకు దిగుతానని పన్నీర్ సెల్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలైన అన్నాడీఎంకే తమదేనని ఓపీఎస్ వర్గం వాదిస్తోంది. ఒక కుటుంబం పిడికిలిలో అన్నాడీఎంకే ఉందని దాన్ని తాము ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని చెబుతోంది. మరోవైపు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ చెల్లదని పన్నీర్ సెల్వం న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి భేటీ ఆసక్తి రేపుతోంది. పన్నీర్ సెల్వం హెచ్చరికను అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తేలిగ్గా తీసుకున్నారు. దీక్ష చేయడం పన్నీర్ సెల్వం ఆరోగ్యానికి మంచిదని ఎద్దేవా చేశారు. -
సర్జికల్ దాడి ఫుటేజీ కేంద్రానికిచ్చిన ఆర్మీ
న్యూఢిల్లీ: సర్జికల్ దాడుల వీడియోలను భారత ఆర్మీ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. దీంతో ఈ ఫుటేజీ విడుదలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత రెండు రోజులుగా సర్జికల్ దాడుల విషయంపై వివాదం రగులుతున్న విషయం తెలిసిందే. ఫుటేజీని బయటపెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తోపాటు పలువురు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏం చేయనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. అటు పాకిస్థాన్‌తోపాటు ప్రతిపక్షాల సభ్యులు కూడా పాకిస్థాన్ భూభాగంలో భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ దాడులకు సంబంధించిన ఫుటేజీ విడుదల చేయాలని, దాడులు జరిగినట్లున్న ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బుధవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ కూడా జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. తన రెండు రోజుల పర్యటనను ముగించుకొని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా వచ్చిన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలోని రక్షణ పరిస్థితిపై ప్రధాని మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. ఫుటేజీ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
భద్రతా భేటీలో ఏం నిర్ణయించారో!
న్యూఢిల్లీ: అటు పాకిస్థాన్‌తోపాటు ప్రతిపక్షాల సభ్యులు కూడా పాకిస్థాన్ భూభాగంలో భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ దాడులకు సంబంధించిన ఫుటేజీ విడుదల చేయాలని, దాడులు జరిగినట్లున్న ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బుధవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. తన రెండు రోజుల పర్యటనను ముగించుకొని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా వచ్చిన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలోని రక్షణ పరిస్థితిపై ప్రధాని మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి పలువురు సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం పది రోజుల తర్వాత భారత ఆర్మీ పాక్ భూభాగంలోకి దూసుకెళ్లి సెప్టెంబర్ 29న సర్జికల్ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేయాలని వస్తున్న డిమాండ్లను ముందునుంచి కేంద్ర తోసిపుచ్చింది. అయితే, ఇటీవలె రాజ్ నాథ్ సింగ్ వేచి చూడండని చెప్పడంతో వాటిని విడుదల చేస్తారనే అభిప్రాయం ఏర్పడింది. ప్రాథమిక సమాచారం ప్రకారం దాడి ఫుటేజీ విడుదల అంశంపై ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. -
మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ఉడి ఉగ్రదాడి, తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చ జరుపుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'కేంద్ర నిధులున్నా ఖర్చులో వెనకబడ్డాం'
ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలోనే వెల్లడి పలు పథకాల కింద కేంద్ర, రాష్ర్ట నిధులు రూ. 11,116 కోట్లు కేటాయింపు ఇందులో విడుదల చేసింది రూ. 8,257 కోట్లు అయితే.. ఖర్చు పెట్టింది 6,820 కోట్లే సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకాల కింద నిధులు అందుబాటులో ఉన్నా ఖర్చు చేయడంలో రాష్ట్రం బాగా వెనుకబడి ఉంది. సీఎం చంద్రబాబు మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ విషయం వెల్లడైంది. ఆర్థిక పరిస్థితి, రెవెన్యూ లోటు, రెండంకెల అభివృద్ధి, ముగిసిన ఆర్థిక సంవత్సరం అకౌం ట్లు తేల్చడంపై మంగళవారం సచివాలయంలో సీఎం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.11,116 కోట్ల కేటాయింపులున్నాయి. ఇందులోని రూ.8,850 కోట్లు కేంద్ర కేటాయింపులు. రూ.2,266 కోట్లు రాష్ట్ర కేటాయింపులు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాల కింద 8,257 కోట్లను విడుదల చేయగా.. వాటిని ఖర్చు చేయడంలో రాష్ట్రం వెనుకబడింది. కేవలం రూ.6,820 కోట్లను మాత్రమే వ్యయం చేసింది. రెండంకెల అభివృద్ధి సాధించాలంటే కేంద్ర పథకాల కింద అందుబాటులో ఉన్న నిధులను వ్యయం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వాటా నిధులను విడుదల చేయడంలో జాప్యం చేయవద్దని ఆర్థికశాఖకు ఆయన సూచించారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద కేంద్రం రూ.2,500 కోట్లను కేటాయించినప్పటికీ రూ.1,700 కోట్లే రాష్ట్రం ఖర్చు చేసింది. రాజధాని నిర్మాణానికి, అక్కడ మౌలిక వసతుల కల్పనకు కేంద్రం విడుదల చేసిన 1,500 కోట్లను వెంటనే వ్యయం చేయాలని, అప్పుడే కేంద్రాన్ని మళ్లీ నిధులు అడగ్గలమని సీఎం పేర్కొన్నారు. ఆ రెండు నెలల రెవెన్యూలోటు రూ.8 వేల కోట్లు.. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన రెండు నెలల(గతేడాది ఏప్రిల్, మే నెలల) రెవెన్యూ లోటును రూ.8 వేల కోట్లుగా తేల్చారు. ఇందులో 58 శాతం నిధులను రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. ఇక రాష్ట్రం విడిపోయాక.. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పది నెలల రెవెన్యూలోటు రూ.10 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ముగిసిన ఆర్థిక సంవత్సరం అకౌంట్లను వీలైనంత త్వరగా తేల్చాలని అకౌంటెంట్ జనరల్‌కు సీఎం సూచించారు. పట్టణాలకు సరిపోయేలా ప్రణాళికలు వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని పట్టణాల రూపురేఖలను మార్చాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సకల సౌకర్యాలు కల్పించాలన్నా రు. సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు, మెప్మా, ప్రజారోగ్య శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్రీడలు, టూరి జం, రోడ్లు, భవనాలు, విద్యుత్, పోలీసు శాఖల సంయుక్త నిర్వహణలో పట్టణాలకు ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. పట్టణాల్లో సంస్కరణలు చేపట్టే ముందు ప్రజలతో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.