పన్నీర్ సెల్వం ఏం చర్చించారో?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి అనూహ్యంగా తప్పుకున్న ఒ పన్నీర్ సెల్వం భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. తన నివాసంలో ఆదివారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తనకు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే ఎంపీలతో ఆయన మంతనాలు జరిపారు. జయలలిత మృతిపై దర్యాప్తు చేపట్టకపోతే మార్చి 8న తన మద్దతుదారులు, పార్టీ నేతలతో కలిసి నిరాహార దీక్షకు దిగుతానని పన్నీర్ సెల్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలైన అన్నాడీఎంకే తమదేనని ఓపీఎస్ వర్గం వాదిస్తోంది. ఒక కుటుంబం పిడికిలిలో అన్నాడీఎంకే ఉందని దాన్ని తాము ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని చెబుతోంది. మరోవైపు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ చెల్లదని పన్నీర్ సెల్వం న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి భేటీ ఆసక్తి రేపుతోంది.
పన్నీర్ సెల్వం హెచ్చరికను అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తేలిగ్గా తీసుకున్నారు. దీక్ష చేయడం పన్నీర్ సెల్వం ఆరోగ్యానికి మంచిదని ఎద్దేవా చేశారు.