పన్నీర్‌పై వేటేసిన చిన్నమ్మ | Sasikala Natarajan removes O Pannerselvam from the post | Sakshi
Sakshi News home page

పన్నీర్‌పై వేటేసిన చిన్నమ్మ

Published Wed, Feb 8 2017 12:58 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

పన్నీర్‌పై వేటేసిన చిన్నమ్మ

పన్నీర్‌పై వేటేసిన చిన్నమ్మ

చెన్నై: ఆవేదనాభరిత ప్రకటనతో పెనుసంచలనం సృష్టించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకు చిన్నమ్మ గట్టి షాకిచ్చింది. మెరీనా బీచ్‌లో పన్నీర్‌ మీడియా సమావేశం అనంతరం పోయెస్‌ గార్డెన్‌లో ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీఅయిన శశికళ అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి పన్నీర్‌ను తొలగిస్తూ మంగళవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీచేశారు. సెల్వం స్థానంలో శ్రీనివాసన్‌ను కోశాధికారిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు మాత్రం ఎక్కడా పేర్కొనలేదు.

ప్రజల మద్దతు ఉన్న వ్యక్తి మాత్రమే పార్టీని నడిపించాలన్నది అమ్మ(జయ) నిర్ణయమని, కానీ ప్రస్తుతం పార్టీలోని పరిస్థితులు అందుకు విరుద్ధంగా తయారయ్యాయని పన్నీర్‌ సెల్వం ఆరోపించడం అన్నాడీఎంకే చీలికకు దారితీసింది. మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద గంటపాటు దీక్ష చేసిన అనంతరం ఓపీఎస్‌ మీడియాతో మాట్లాడారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తనను సీఎం పదవి నుంచి బలవంతంగా తొలిగించారని ఆయన ఆవేదన చెందారు. ఓపీఎస్‌ మీడియా సమావేశం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. 'ఓపీఎస్‌.. ఓపీఎస్‌..' అంటూ పెద్ద ఎత్తున నినాదాలుచేస్తూ, శశికళపై విమర్శలు చేశారు. అటు శశికళ కూడా వేగంగా స్పందిస్తూ కీలక నాయకులతో మంతనాలు సాగించారు. చివరికి పన్నీర్‌ను పార్టీ పదవి నుంచి తొలిగించారు. ఒకవేళ పన్నీర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లైతే అతని ఇమేజ్‌ మరింత పెరుగుతుందనే భావనతోనే చిన్నమ్మ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు అర్థం అవుతున్నది.  
(అన్నాడీఎంకేలో చీలిక..!)
(తమిళనాట సంచలనం: పన్నీర్‌ తిరుగుబాటు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement