అన్నాడీఎంకేలో చీలిక..! | Sasikala urgent meeting with MLAs, OPS also busy | Sakshi

అన్నాడీఎంకేలో చీలిక..!

Feb 7 2017 11:41 PM | Updated on Sep 5 2017 3:09 AM

అన్నాడీఎంకేలో చీలిక..!

అన్నాడీఎంకేలో చీలిక..!

50 మంది ఎమ్మెల్యేలు పన్నీర్‌ సెల్వంకు మద్దతు పలుకుతున్నారని ప్రముఖ చానెళ్లల్లో వార్తలు ప్రసారం అవుతున్నాయి. రేపు ఉదయం లేదా సాయంత్రానికి పన్నీర్‌ను బలపరిచే ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరగొచ్చని,

- రాష్ట్రవ్యాప్తంగా పన్నీర్‌ వర్గీయుల సంబరాలు
- పోయెస్‌ గార్డెన్‌లో శశికళ మంత్రాంగం


చెన్నై: మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం(ఓపీఎస్‌) తిరుగుబావుటాతో అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలినట్లైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై తీవ్రస్థాయి విమర్శలు చేసిన ఓపీఎస్‌కు ఎల్లడలా మద్దతు లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకొంటున్నారు.

ఈ పరిణామాలతో ఇరుకున పడ్డ శశికళ.. అతివేగంగా పావులు కదుపుతున్నారు. మంగళవారం రాత్రి ఓపీఎస్‌ మీడియా సమావేశం ముగిసిన వెంటనే.. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో పోయెస్‌ గార్డెన్‌లో అత్యవసరంగా భేటీ అయ్యారు. పన్నీర్‌ సెల్వంకు, ఆయన చేసిన ఆరోపణలకు గట్టిగా బదులు చెప్పాలని శశికళ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే.. 'ఓపీఎస్‌ కేంద్రం(బీజేపీ) చేతిలో రిమోట్‌కంట్రోల్‌' అంటూ శశికళ వర్గీయులు ఎదురుదాడి మొదలుపెట్టారు.
(తమిళనాట సంచలనం: పన్నీర్‌ తిరుగుబాటు)

ఇదిలాఉంటే, 50 మంది ఎమ్మెల్యేలు పన్నీర్‌ సెల్వంకు మద్దతు పలుకుతున్నారని ప్రముఖ చానెళ్లల్లో వార్తలు ప్రసారం అవుతున్నాయి. రేపు ఉదయం లేదా సాయంత్రానికి పన్నీర్‌ను బలపరిచే ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరగొచ్చని, వారి మద్దతుతో ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారని, ఆమేరకు జరిగే ప్రయత్నంలో బీజేపీ(కేంద్ర ప్రభుత్వం) కూడా దన్నుగా నిలుస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శశికళ సీఎంగా ప్రమాణం చేసే అవకాశాలు దాదాపు సన్నగిల్లినట్లైంది.


ప్రజల మద్దతు ఉన్న వ్యక్తి మాత్రమే పార్టీని నడిపించాలన్నది అమ్మ(జయ) నిర్ణయమని, కానీ ప్రస్తుతం పార్టీలోని పరిస్థితులు అందుకు విరుద్ధంగా తయారయ్యాయని పన్నీర్‌ సెల్వం ఆరోపించారు. మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద గంటపాటు దీక్ష చేసిన అనంతరం ఓపీఎస్‌ మీడియాతో మాట్లాడారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తనను సీఎం పదవి నుంచి బలవంతంగా తొలిగించారని ఆయన ఆవేదన చెందారు. ఓపీఎస్‌ మీడియా సమావేశం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. 'ఓపీఎస్‌.. ఓపీఎస్‌..' అంటూ పెద్ద ఎత్తున నినాదాలుచేస్తూ, శశికళపై విమర్శలు చేశారు.
(సంచలన నిజాలు చెప్పిన పన్నీర్ సెల్వం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement