
సాక్షి, ఢిల్లీ: రెమాల్ తుపానుపై ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. వెస్ట్ బెంగాల్‌లో తీరం దాటనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వెస్ట్ బెంగాల్‌కు జాతీయ విపత్తు దళం ద్వారా అన్ని రకాల సహాయం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు.
తీవ్ర తుపానుగా బలపడిన ‘రెమాల్’ ఈరోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తుపాను ప్రభావంతో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు.
Comments
Please login to add a commentAdd a comment