కోవిడ్‌పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం | PM Narendra Modi chairs high-level meeting on Covid | Sakshi
Sakshi News home page

కోవిడ్‌పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం

Published Sun, Sep 12 2021 6:16 AM | Last Updated on Sun, Sep 12 2021 6:16 AM

PM Narendra Modi chairs high-level meeting on Covid - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ నిర్వహణ, వ్యాక్సినేషన్, పెరుగుతున్న కేసులు వంటి వాటిపై ప్రధాని మోదీ శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పీడియాట్రిక్‌ కేర్‌ (చిన్నారుల ఆరోగ్య వ్యవస్థ)కు సంబంధించి పడకల వివరాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో పడకలు ఏర్పాటు చేసేలా కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని అధికారులు మోదీకి వ్యవరించారు.

దీంతో పాటు కోవిడ్‌ మందుల అందుబాటు, నిల్వలపై రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన వ్యవహారం కూడా మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో మహారాష్ట్ర, కేరళలతో పాటు ప్రపంచంలో కూడా కేసులు పెరుగుతున్న వైనాన్ని సమావేశంలో చర్చించారు. ఆక్సిజన్‌ అందుబాటు, కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లు, పీఎస్‌ఏ ప్లాంట్లు వంటి వివరాల గురించి మోదీ ఆరా తీశారు. కనీసం జిల్లాకొకటి చొప్పున దేశంలో ఇన్‌స్టాల్‌ చేయనున్న 961 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు, 1450 మెడికల్‌ గ్యాప్‌ పైప్‌లైన్‌ సిస్టం గురించి సమావేశంపై విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement