
ఫైల్ ఫోటో
సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో వరద నష్టానికి ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రిని కేసీఆర్ కోరారు. వరద సాయంతోపాటు ఇతర కీలక అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. సుమారు 45 నిమిషాల పాటు చర్చలు సాగాయి. రేపు (శనివారం) కూడా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ ఉండనున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు గంటకుపైగా కొనసాగింది. కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. (చదవండి: హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ!)
Comments
Please login to add a commentAdd a comment