రాష్ట్ర బడ్జెట్‌పై నేడు సీఎం మధ్యంతర సమీక్ష | CM KCR Review Meeting On Budget Today | Sakshi
Sakshi News home page

రాష్ట్ర బడ్జెట్‌పై నేడు సీఎం మధ్యంతర సమీక్ష

Published Sat, Nov 7 2020 7:27 AM | Last Updated on Sat, Nov 7 2020 7:27 AM

CM KCR Review Meeting On Budget Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై సీఎం కేసీఆర్‌ శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహిస్తారు. 2020 –21 బడ్జెట్‌పై కూడా మధ్యంతర సమీక్ష జరుపుతారు. కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, సవరించుకోవాల్సిన అంశాలపై చర్చిస్తారు. సీఎస్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. సమీక్షలో వచ్చే అంచనాలపై చర్చించేందుకు ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశముంది.

యాదాద్రి ఆలయంపై నేడు సీఎం సమీక్ష
యాదాద్రి దేవాలయ నిర్మాణపనులపై సీఎం కేసీఆర్‌ శనివారం సాయంత్రం 4 గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు. వైటీడీఏ స్పెషల్‌ అధికారి, యాదాద్రి జిల్లా కలెక్టర్,   తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement