ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన జగన్నాథ రథయాత్ర ప్రారంబోత్సవంలో సీఎం రేవంత్
పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుడిని ప్రార్ధించినట్లు వెల్లడి
రథానికి దిష్టి తీసి, చీపురుతో రోడ్డు ఊడ్చి యాత్రను ప్రారంభించిన ముఖ్యమంత్రి
కవాడిగూడ: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందరిదీ అని.. తమ సర్కారు మతసామరస్యాన్ని కాపాడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. సర్వ మతాలకు స్వేచ్ఛ, భావజాలం వ్యాప్తికి అవకాశం ఇవ్వడంతోపాటు భక్తులకు సౌకర్యాలు కలి్పంచడాన్ని బాధ్యతగా తీసుకుంటోందన్నారు. అన్ని మతాల ఆచార, సంప్రదాయాలను గౌరవిస్తామన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా తమ ప్రభుత్వం ప్రయతి్నస్తుందని చెప్పారు. ఆదివారం అబిడ్స్ ఇస్కాన్ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన పూరీ జగన్నాథ రథయాత్రకు సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గుమ్మడికాయతో దిష్టి తీసి హారతి ఇచ్చి రథం ముందు చీపురుతో రోడ్డు ఊడ్చి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాజుల కాలం నుంచి వస్తున్న పూరీ సంప్రదాయాన్ని తాను సీఎం హోదాలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పాడిపంటలు బాగా పండి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని వేడుకుంటున్నానని తెలిపారు. అనంతరం భాగవతం కాపీలను అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇస్కాన్ నిర్వాహకులు ప్రసాదం అందజేసి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీ మందడి అనిల్ కుమార్‌యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితోపాటు భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment