సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. ప్రధాని మోదీ, అమిత్ షా, సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ ఇలా ఆగ్ర నేతల రాకతో రసవత్తర రాజకీయానికి తెలంగాణ వేదికగా మారింది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రారున్నారు. ఈనెల రెండో వారంలో తెలంగాణలో అడుగుపెట్టనున్న రాహుల్.. మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటనకు టీ కాంగ్రెస్ కార్యక్రమాలు సిద్ధం చేస్తోంది.
ఇక ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇటీవలె హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం, కాంగ్రెస్ విజయభేరి పేరుతో భారీ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన ఈ సభలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చేది తామేనని.. ఆ వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించింది. తుక్కుగూడ సభ అనంతరం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.
మరోవైపు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలోప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించిన బీఆర్ఎస్ అభివృద్ధి పనులతో పాటు ప్రచారంపై కూడా దృష్టిపెట్టింది. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పక్కాగా వ్యూహలను రచించే పనిలో ఉన్నాయి.
చదవండి: తెలంగాణ దేవాలయాలే టార్గెట్.. ఐటీ శాఖ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment