
సిద్దిపేటకమాన్: కరోనా పాజిటివ్ వచ్చిన తొమ్మిది నెలల గర్భిణిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తూ సిద్దిపేట జిల్లా 108 సిబ్బంది మార్గమధ్యలో వాహనంలో మంగళవారం డెలివరీ చేశారు. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..
హుజూరాబాద్‌కు చెందిన తొమ్మిది నెలల గర్భిణికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమెను డెలివరీ నిమిత్తం ప్రత్యేక చికిత్స అందించడానికి 108 వాహనంలో హైదరాబాద్‌కు తరలించే క్రమంలో జిల్లాలోని నంగునూరు మండల 108 వాహన సిబ్బంది ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో శామీర్‌పేటకు వద్దకు వెళ్లగానే మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌లోనే ఆమెకు సిబ్బంది డెలివరీ చేశారు. తల్లి పాప ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు, ఇద్దరిని హైదరాబాద్‌కు తరలించినట్లు సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment