సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ హరీష్ తదితరులు
సాక్షి,మేడ్చల్ జిల్లా: చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని.. ఈ విషయంలో చట్టాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ హరీష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ కమిటీ (జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ), చైల్డ్ అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు.
బడులకు పంపించేలా చర్యలు తీసుకోవాలి..
♦ చిన్న పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. వారి తల్లిదండ్రులు పాఠశాలల్లో చేరి్పంచాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ కోరారు. చాలా మంది చిన్నారులు ఇటుక బట్టీల్లో కూలీలుగా పని చేస్తున్నారని చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి పనులు మాని్పంచి పాఠశాలలకు వెళ్లేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
1098 సేవలను వినియోగించుకోవాలి..
♦ బాలల అక్రమ రవాణా, లైంగికదాడులు, బాల్య వివాహాలు, వేధింపులకు గురి చేసినా ఇతర ఇబ్బందికరమైన చర్యలకు పాల్పడినా వారిపై సంబంధిత యాక్టుల ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. పిల్లలకు ఉన్న హక్కులను ఎవరూ దూరం చేయరాదన్నారు. వారి హక్కుల రక్షణతో పాటు వారి అభివృద్ధికి కావాల్సిన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. చైల్డ్‌లైన్ 1098 సేవలను వినియోగించుకోవాలని కోరారు.
మూడు నెలలకో సమావేశం నిర్వహించాలి...
♦ ప్రతి మూడు నెలలకోసారి ఈ సమావేశం నిర్వహించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, స్యాంసన్, జిల్లా సంక్షేమాధికారి అంకేశ్వరరావు, రాచకొండ డీసీపీ సలీమా, డీఆర్డీవో పద్మజా, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.మల్లికార్జున్‌రావు, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ రాజారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment