రాత్రికిరాత్రే గృహప్రవేశాలు.. ఇళ్లలోకి చొరబడి తాళాలు! | Double Bedroom House: Villagers Went Homes Overnight Without Permission | Sakshi
Sakshi News home page

రాత్రికిరాత్రే గృహప్రవేశాలు.. ఇళ్లలోకి చొరబడి తాళాలు!

Published Mon, May 31 2021 10:19 AM | Last Updated on Mon, May 31 2021 10:21 AM

Double Bedroom House: Villagers Went Homes Overnight Without Permission - Sakshi

సాక్షి, చిలుకూరు : డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో విసిగివేసారిన కొందరు నిరుపేదలు రాత్రికిరాత్రే గృహప్రవేశాలు చేశారు. ఈ సంఘటన చిలుకూరు మండలంలోని పోలేనిగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలో మూడేళ్ల కిత్రం 40 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించినా లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. దీంతో 40కుటుంబాల వారు ఆ ఇళ్లలోకి చొరబడి తాళాలు వేసుకున్నారు.

ఇళ్లు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందని పలువురు తెలిపారు. లబ్ధిదారులను ఎంపిక చేయనప్పటికీ గృహప్రవేశం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ రాజేశ్వరీదేవి హెచ్చరించారు. సిబ్బందిని పంపించి గృహాలను ఖాళీ చేయిస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement