దుబ్బాక ‘కమలా’నిదే
నరాలు తెగే ఉత్కంఠ కలిగించిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంలో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు 1470 ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. దీంతో కాషాయ పార్టీలో సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఓటమి తప్పలేదు.
విజయానికి అడుగుదూరంలో బీజేపీ
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం టీ20 మ్యాచ్ ఫైనల్ పోరులో సూపర్ ఓవర్‌ను తలపిస్తోంది. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య హోరాహోరాగా సాగుతున్న పోరులో కమలమే పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. కాగా 22వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం(438) కొనసాగిస్తోంది. ఇంకా ఒక్క రౌండ్ ఫలితం మాత్రమే మిగిలి ఉంది. 23వ రౌండ్‌లోనూ కాషాయ పార్టీ జోరు ఇలాగే కొనసాగితే రఘునందన్ రావు విజయం లాంఛనమే కానుంది. 22 రౌండ్లు ముగిసేసరికి ఆయన 1058 ఓట్ల మెజారిటీ సాధించారు.
కమల వికాసం
21వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తోంది. మరో రెండు రౌండ్ల కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉన్న వేళ బీజేపీ మొత్తంగా 621 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
నరాలు తెగే ఉత్కంఠ
కారు జోరు కొనసాగుతున్న వేళ అనూహ్యంగా 20వ రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకు వచ్చింది. 100 ఓట్ల ఆధిక్యం సాధించింది. అయితే 20వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ 491 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. ఇక ఉత్కంఠగా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో మరో 3 రౌండ్ల ఫలితాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చేగుంట, నార్సింగి మండలాల ఫలితంపై ప్రభావం చూపనున్నాయి.
దూసుకుపోతున్న కారు
19 రౌండ్‌లోనూ గులాబి పార్టీ జోరు కొనసాగుతోంది. ఈ రౌండు పూర్తయ్యే సరికి టీఆర్‌ఎస్ 425 ఓట్ల మెజారిటీ సాధించింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 2760, బీజేపీకి 2335, కాంగ్రెస్‌కు 976 ఓట్లు వచ్చాయి.
18వ రౌండ్‌లోనూ ‘గులాబీ’ గుభాలింపు
అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యం కొనసాగిస్తోంది. 18వ రౌండ్‌లోనూ 688 ఓట్ల మెజారిటీ సాధించింది. 18 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యం 172 ఓట్లకు తగ్గింది. మిగిలి ఉన్న మరో 5 రౌండ్ల ఫలితాలు కీలకం కానున్నాయి. చేగుంట, నార్సింగి మండలాల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఆగని కారు జోరు
17వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ 800 ఓట్ల మెజారిటీ సాధించింది. 17 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యం 934 ఓట్లకు తగ్గింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 2818, బీజేపీకి 1946, కాంగ్రెస్‌కు 1705 ఓట్లు వచ్చాయి.
16వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ హవా
టీఆర్‌ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. 16వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి 750 ఓట్ల ఆధిక్యత దక్కింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3157, బీజేపీకి 2408, కాంగ్రెస్‌కు 674 ఓట్లు దక్కాయి.
కొనసాగుతున్న టీఆర్‌ఎస్ జోరు
15వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ పార్టీ మెజారిటీ సాధించింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి 955 ఓట్ల ఆధిక్యం దక్కింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్ 3027, బీజేపీ 2072, కాంగ్రెస్ పార్టీ 1500 ఓట్లు తెచ్చుకున్నాయి. 15వ రౌండ్ ముగిసే సరికి 2483 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం బీజేపీ 41514, టీఆర్‌ఎస్ 38,076, కాంగ్రెస్ 12658 ఓట్లు సాధించాయి.
14వ రౌండ్‌లోనూ కారు హవా
14వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ ఆధిక్యం కనబరిచింది. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ 288 ఓట్ల మెజారిటీ దక్కించుకుంది. టీఆర్‌ఎస్‌కు 2537, బీజేపీకు 2249, కాంగ్రెస్ పార్టీకి 784 ఓట్లు వచ్చాయి. 14 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ 3,438 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
13వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ జోరు
దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ 13, 14 రౌండ్లలో ఆధిక్యత ప్రదర్శించింది. 13వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 304 ఓట్ల ఆధిక్యం దక్కింది. 13వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ 2824, బీజేపీ 2520, కాంగ్రెస్ 1212 ఓట్లు దక్కించుకున్నాయి.
►12వ రౌండ్‌లో అనూహ్యంగా కాంగ్రెస్ 83 ఓట్ల ఆధిక్యత సాధించింది. 12 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ 4,030 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 11వ రౌండ్‌లో బీజేపీ 1997.. టీఆర్‌ఎస్ 1900.. కాంగ్రెస్ 2,080 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 36,745.. టీఆర్‌ఎస్ 32,715.. కాంగ్రెస్ 10,662 ఓట్లు సాధించింది. ఇంకా 11 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.
►11వ రౌండ్‌లో బీజేపీ 199 ఓట్ల స్వల్ప ఆధిక్యత సాధించింది. 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ 3,911 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 11వ రౌండ్‌లో బీజేపీ 2965.. టీఆర్‌ఎస్ 2,766.. కాంగ్రెస్ 1883 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 34,748.. టీఆర్‌ఎస్ 30,815.. కాంగ్రెస్ 8,582 ఓట్లు సాధించింది. ఇప్పటిదాకా మొత్తం 66,807 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇంకా 12 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.
►ఇప్పటిదాకా 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తికాగా.. 6,7,10 రౌండ్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యాన్ని సాధించగా.. మిగిలిన అన్నింటిలోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది.
►10వ రౌండ్‌లో టీఆర్ఎస్ 456 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ 3,734 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 10వ రౌండ్‌లో బీజేపీ 2,492.. టీఆర్‌ఎస్ 2,948.. కాంగ్రెస్ 899 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 31,783.. టీఆర్‌ఎస్ 28,049.. కాంగ్రెస్ 6,699 ఓట్లు సాధించింది. ఇప్పటిదాకా మొత్తం 66,807 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇంకా 13 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.
►తొమ్మిదో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. 9 రౌండ్లు కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ 4,190 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 9వ రౌండ్‌లో బీజేపీ 3,143.. టీఆర్‌ఎస్ 2,329.. కాంగ్రెస్ 675 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 29,291.. టీఆర్‌ఎస్ 25,101.. కాంగ్రెస్ 5,800 ఓట్లు సాధించింది. ఇప్పటిదాకా మొత్తం 66,807 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇంకా 14 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.
►ఇప్పటివరకు దుబ్బాక కౌంటింగ్ 8 రౌండ్లు పూర్తికాగా.. 6 రౌండ్లలో బీజేపీ, రెండు రౌండ్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించాయి. మొత్తంగా బీజేపీ 25,878.. టీఆర్‌ఎస్ 22,722.. కాంగ్రెస్ 5,125 ఓట్లు సాధించాయి.
►పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్‌ఎస్ 1,008.. బీజేపీ 492 సాధించాయి.
►8వ రౌండ్‌లో బీజేపీ 621 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. అయితే ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ 3,106 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రౌండ్‌లో బీజేపీ 3,116 టీఆర్‌ఎస్ 2,495.. కాంగ్రెస్ 1,122 ఓట్లు సాధించాయి.
► ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్ 182 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఏడురౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ 2,485 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తంగా బీజేపీ 22,762.. టీఆర్‌ఎస్ 20,277.. కాంగ్రెస్ 4,003 ఓట్లు సాధించాయి. ఇప్పటివరకూ.. 52,055 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.
►రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్‌లో టీఆర్‌ఎస్‌కు 846 ఓట్ల ఆధిక్యం లభించింది.
►దుబ్బాక ఉపఎన్నికలో మొత్తం 1,64,192 ఓట్లు పోలవ్వగా.. ఇప్పటిదాకా 45,175 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.
►ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ 353 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 2,667 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 20,226.. టీఆర్‌ఎస్ 17,559.. కాంగ్రెస్ 3,254 ఓట్లు సాధించాయి.
►వరుసగా ఐదో రౌండ్‌లోనూ బీజేపీ 336 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఐదో రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 3,020 ఓట్ల లీడ్‌లో ఉంది. ఇప్పటివరకు బీజేపీ 16,507.. టీఆర్‌ఎస్ 10,497.. కాంగ్రెస్ 2,724 ఓట్లు సాధించాయి.
►దుబ్బాక నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. 4 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 2,684ఓట్ల ఆధిక్యం సాధించింది. ఇంకా 19 రౌండ్ల ఫలితాలు తేలాల్సి ఉంది. నాలుగో రౌండ్‌లో బీజేపీ 3,832.. టీఆర్‌ఎస్ 2,407.. కాంగ్రెస్ 227 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 13,055, టీఆర్‌ఎస్ 10,371 కాంగ్రెస్ 2,158 ఓట్లు సాధించాయి.
►నాలుగో రౌండ్‌లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ నాలుగో రౌండ్‌లో 1,425 ఓట్లు ఆధిక్యత సాధించారు.
►ప్రారంభమైన మిర్దొడ్డి మండల కౌంటింగ్
►ముగిసిన దుబ్బాక మండల కౌంటింగ్
►ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీ 110 ఓట్ల ఆధిక్యం సాధించింది.
► దుబ్బాక ఉపఎన్నిక మూడో రౌండ్‌ల కౌంటింగ్ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు 1,259 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇప్పటిదాకా బీజేపీకి 9,224.. టీఆర్‌ఎస్‌కి 7,964.. కాంగ్రెస్‌కి 1,931 ఓట్లు లభించాయి.
దుబ్బాక తొలి ఫలితాలపై రాంమాధవ్ ట్వీట్
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోందని బీజేపీ సీనియర్ నాయకుడు రాంమాధవ్ ట్వీట్ చేశారు. తమ పార్టీ ప్రస్తుతం ఆధిక్యంలో ఉందని, బీజేపీ అనూహ్య విజయం సాధించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
An interesting fight in Telangana between BJP n TRS in Dubbaka Assembly by poll. BJP is currently leading. This could be a surprise victory for BJP
— Ram Madhav (@rammadhavbjp) November 10, 2020
► దుబ్బాక ఉపఎన్నిక రెండో రౌండ్‌లో బీజేపీ 279 ఓట్ల ఆధిక్యత సాధించింది. రెండో రౌండ్‌లో బీజేపీకి 1,561 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 1,282 ఓట్లు లభించాయి. మొదటి రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ మొత్తం 1,135 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 6,492, టీఆర్ఎస్‌కు 5,357 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,315 ఓట్లు లభించాయి.
► దుబ్బాక ఉపఎన్నిక తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 341 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. మొదటి రౌండ్‌లో బీజేపీ 3,208 ఓట్లు సాధించగా.. టీఆర్‌ఎస్ 2,867.. కాంగ్రెస్ 648 ఓట్లు సాధించాయి. తొలి రౌండ్‌లోదుబ్బాక మండలానికి చెందిన ఈవీఎంలలోని ఓట్లను లెక్కించారు.
► దుబ్బాకలో ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ ఫలితం అరగంటలో వచ్చే అవకాశం ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
► దుబ్బాక ఉప ఎన్నికలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది. మొత్తం 1453 పోస్టల్ బ్యాలెట్స్, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయి.
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 3న పోలింగ్ జరగ్గా మంగళవారం ఓట్ల లెక్కింపు కోసం సిద్దిపేట సమీపంలోని పొన్నాల ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 315 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉప ఎన్నిక జరిగింది. మొత్తం 23 మంది పోటీ చేశారు. మొత్తం రెండు గదుల్లో ఒక్కో గదిలో 7 టేబుల్స్ చొప్పున 14 టేబుల్స్ వేశారు. 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితం వెలువడనుంది.
మొదట అరగంట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఏం మిషన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ఇందుకోసం అన్నిరకాలుగా భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రతీ రౌండ్ కు సంబంధించిన కౌంటింగ్ వారీగా ఎంట్రీలు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. అదే విధంగా బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యంతో వీడియో గ్రఫీ చేస్తున్నామని, కౌంటింగ్ కేంద్ర ఆవరణలో మీడియా రూమ్ ఏర్పాటు చేసి రౌండ్ వారీగా కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు అందజేయనున్నట్లు చెప్పారు. కౌంటింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత వెబ్‌సైట్‌లో రౌండ్ వారీగా పొందుపరుస్తామని వివరించారు. కౌంటింగ్ చేపట్టే అధికారిక సిబ్బంది నియామకం, వారికి శిక్షణ సైతం పూర్తయినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కావాల్సిన వివిధ శాఖల అధికారిక సిబ్బంది నియామకం, శిక్షణ సైతం పూర్తయ్యిందని, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపును చేపట్టాలని అధికార వర్గాలకు ఆదేశించినట్లు తెలిపారు.
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ ఫోటోలు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment