సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించాల్సిన ఎన్నికలను కూడా వాయిదా వేసినట్టు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30వ తేదీ వరకు కరోనా కట్టడికి సంబంధించి ఆంక్షలు అమలులో ఉంటాయని కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలో ఉన్న ఆంక్షలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఏపీలో 3 మండలి స్థానాలకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. అదే విధంగా తెలంగాణలో 6 మండలి స్థానాలకు జూన్ 3తో గడువు ముగియనుంది. కరోనా పరిస్థితులను బట్టి తదుపరి తేదీలను ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
చదవండి: సై అంటే సై.. నాయకుల సోషల్ యుద్ధం
TS: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా
Published Sat, May 29 2021 10:28 AM | Last Updated on Sat, May 29 2021 10:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment