సాక్షి, సిటీబ్యూరో: ప్రజల ఆదాయం పెరగటంలేదు... కానీ పెరిగిన నిత్యావసరాల ధరలు మాత్రం పట్టపగలే చుక్కలను చూపిస్తున్నాయి. ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టులేదని సామాన్యులు వాపోతున్నారు.
- కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో కోట్లాది కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొందరికి సరైనా ఉపాధి లభించడం లేదు. కొందరికి ఉద్యోగం ఉన్నా.. వేతనాల్లోనూ కోతల కారణంగా బడ్జెట్ తారుమారైంది.
- దీనికి తోడు ఇటీవల ఇంధనం, గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. పెరిగిన పెట్రో ధరల ప్రభావం నిత్యావసరాల ధరపై పడింది. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
- కిరాణా షాపులో వారం క్రితం కొన్న సామగ్రి రేటు మరో వారానికి మారిపోతోంది. అమాంతంగా పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్యతరగతి వర్గాలవారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- పెరిగిన ధరలతో నగరంలో ఒక్కో కుటుంబంపై నెలకు రూ.800 నుంచి రూ.1,000 వరకు అదనపు భారం పడుతోంది. ఫలితంగా సామన్యుల్లో పడిపోయిన పొదుపు సామర్థ్యం పడిపోయిందని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు.
పెరిగిన రవాణా చార్జీలతో ..
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వస్తు రవాణా చార్జీలు కూడా పెరుగుతున్నాయి.
- పెరిగిన రవాణా చార్జీల కారణంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలపై పడుతుండటంతో వాటి ధరలు కూడా పెరిగి సామాన్యుడి నెలసరి బడ్జెట్ తారుమారు అవుతోంది. నెల జీతంతో ఇల్లు గడవని పరిస్థితి నెలకొంటోంది.
- నగరానికి వచ్చే పప్పులు, మసాల దినుసులు, ఇతర నిత్యావసర వస్తువుల్లో అధిక శాతం పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఉత్తరాది నుంచి దిగుమతి అవుతాయి.
- పెట్రో ధరలు పెరగడంతో రవాణా చార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయి.
- దీనికి తోడు కరోనా, లాక్‌డౌన్ కారణంగా సమయానికి సరుకులు నగర మార్కెట్లకు దిగుమతి కావడంలేదు.
- గ్రేటర్ ప్రజల డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో కూడా వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు.
- ఈ ఏడాది వర్షాలు బాగా పడటంతో పంటలు దిగబడి పెరిగింది. ఈ నేపథ్యంలో పప్పుదినుసుల ధరలు తగ్గాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పంటలు దిగుమతి పెరిగినా ఇంధన ధరలు పెరగడంతో ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు పెరిగి నిత్యావసరాలు అధిక ధరల మోత మోగిస్తున్నాయి.
ప్రస్తుతం కిలో రూ. ల్లో 2 నెలల క్రితం కిలో రూ. ల్లో
కందిపప్పు 100– 120 85
మినపప్పు 120 –130 100
పెసరపప్పు 100– 110 90
చక్కెర 40 –45 35
బియ్యం(మంచివి) 45– 55 32–35
గోధుమలు 42 36
జొన్నలు 60 45
Comments
Please login to add a commentAdd a comment