
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగ దరఖాస్తు గడువు జూన్ 4వ తేదీ వరకు పొడిగించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 3,48,095 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మే 2వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించిన టీఎస్‌పీఎస్సీ.. మే 31 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తుకు గడువును విధించింది. ఈక్రమంలో దరఖాస్తుల స్వీకరణ మొదలైన తొలి వారంలో ఆశించిన మేర స్పందన లేదు.
ఓటీఆర్ సవరణ, స్థానికతకు సంబంధించి బోనఫైడ్ అప్‌లోడ్ తదితర అంశాల నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ నెమ్మదిగా సాగింది. స్థానికత ధ్రువీకరణకు కీలకమైన బోనఫైడ్‌లు అందుబాటులో లేని పలువురు అభ్యర్థులు పాఠశాలల చుట్టూ తిరుగుతుండడం మరోవైపు పరీక్షకు సన్నద్ధం కావాలనే తాపత్రయంతో కొందరు అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈక్రమంలో బోనఫైడ్ అప్‌లోడ్ నిబంధనకు బ్రేక్ ఇచి్చన టీఎస్‌పీఎస్సీ.. చదువుకున్న వివరాలను సరిగ్గా ఎంట్రీ చేస్తే చాలని సూచించింది. దీంతో దరఖాస్తు నమోదు వేగం పుంజుకుంది. చివరి రెండ్రోజుల్లో ఏకంగా 60 వేల దరఖాస్తులు వచి్చనట్లు అంచనా.
Comments
Please login to add a commentAdd a comment