Group -1
-
గ్రూప్ -1 పరీక్ష పూర్తయిన తరువాత అభ్యర్థుల స్పందన
-
గ్రూప్–1 దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగ దరఖాస్తు గడువు జూన్ 4వ తేదీ వరకు పొడిగించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 3,48,095 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మే 2వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించిన టీఎస్పీఎస్సీ.. మే 31 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తుకు గడువును విధించింది. ఈక్రమంలో దరఖాస్తుల స్వీకరణ మొదలైన తొలి వారంలో ఆశించిన మేర స్పందన లేదు. ఓటీఆర్ సవరణ, స్థానికతకు సంబంధించి బోనఫైడ్ అప్లోడ్ తదితర అంశాల నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ నెమ్మదిగా సాగింది. స్థానికత ధ్రువీకరణకు కీలకమైన బోనఫైడ్లు అందుబాటులో లేని పలువురు అభ్యర్థులు పాఠశాలల చుట్టూ తిరుగుతుండడం మరోవైపు పరీక్షకు సన్నద్ధం కావాలనే తాపత్రయంతో కొందరు అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈక్రమంలో బోనఫైడ్ అప్లోడ్ నిబంధనకు బ్రేక్ ఇచి్చన టీఎస్పీఎస్సీ.. చదువుకున్న వివరాలను సరిగ్గా ఎంట్రీ చేస్తే చాలని సూచించింది. దీంతో దరఖాస్తు నమోదు వేగం పుంజుకుంది. చివరి రెండ్రోజుల్లో ఏకంగా 60 వేల దరఖాస్తులు వచి్చనట్లు అంచనా. -
క్రీడాకారుడి స్వప్నాన్ని చిదిమేయలేరు
సాక్షి, అమరావతి: గ్రూప్–1 పోస్టుల భర్తీలో క్రీడాకారులకు 2% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోలో ఏయే క్రీడాకారులు అందుకు అర్హులో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నప్పుడు అందుకు విరుద్ధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహరించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతర్జాతీయ, బహుళ జాతి క్రీడల్లో పాల్గొన్న వారిని మాత్రమే ప్రతిభావంత క్రీడాకారులుగా పరిగణించడానికి వీల్లేదని పేర్కొంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరు గ్రూప్–1 పోస్టులను అంతర్జాతీయ, బహుళ జాతి క్రీడల్లో పాల్గొన్న వారికే పరిమితం చేసేలా ఉందని ఆక్షేపించింది. తోకను కుక్క ఆడిస్తుందే తప్ప, తోక కుక్కను ఆడించదని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన లేదన్న కారణంతో ఓ క్రీడాకారుడిని క్రీడల కోటా కింద పరిగణనలోకి తీసుకోవడానికి సర్వీస్ కమిషన్ కమిటీ తిరస్కరించడాన్ని తప్పు పట్టింది. ఆ అభ్యర్థిని క్రీడల కోటా కింద పరిగణనలోకి తీసుకోవాలని సర్వీస్ కమిషన్‌ను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఇటీవల తీర్పునిచ్చారు. అధికారులు నిబంధనలకు స్వీయ భాష్యం చెబుతూ ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్న ఓ క్రీడాకారుడి స్వప్నాన్ని చిదిమేయలేరని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. కేసు పూర్వాపరాలివీ.. జాతీయస్థాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొన్నప్పటికీ తనను క్రీడల కోటా కింద పరిగణనలోకి తీసుకునేందుకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిటీ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ జె.వెంకట బాలాజీ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్–1 ప్రధాన పరీక్షలో కూడా అర్హత సాధించానని, అయితే అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనలేదంటూ క్రీడల కోటా కింద తనను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ సోమయాజులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరును తప్పుబట్టారు. రాజ్యాంగంలోని అధికరణ 309 కింద రూపొందించిన రాష్ట్ర, సబార్డినేట్ రూల్స్‌లో ఎక్కడా కూడా ప్రతిభావంతుని నిర్వచన పరిధిని అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న వ్యక్తికి మాత్రమే పరిమితం చేయలేదన్నారు. çకమిషన్ వాదనను ఆమోదిస్తే.. గ్రూప్–1 పోస్టులు కేవలం కొన్ని కేటగిరీల ప్రతిభావంత క్రీడాకారులకే పరిమితం అవుతాయన్నారు. పాఠశాల, వర్సిటీ, జాతీయ, స్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా ప్రతిభావంతుల కిందకే వస్తారని తెలిపారు. -
సజావుగా గ్రూప్–1 మెయిన్ పరీక్ష
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన గ్రూప్–1 మెయిన్ పేపర్–2 పరీక్ష సజావుగా ముగిసింది. పరీక్ష జరుగుతున్న ఎస్ఎస్బీఎన్ డిగ్రీ, జూనియర్ కళాశాల కేంద్రాలను జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి తనిఖీ చేశారు. 688 అభ్యర్థులకు గాను మూడో రోజు పరీక్షకు 441 మంది హాజరయ్యారు. పరీక్షలను లైజన్ అధికారి సురేశ్ బాబు, ఏపీపీఎస్ అధికారులు కుమార్రాజ్, వసంతకుమార్, సురేశ్‌బాబు, అసిస్టెంట్ లైజన్ అధికారులు నాగభూషణం, జయరాముడు పర్యవేక్షించారు. -
గూప్‌వన్ అధికారుల అభినందనలు
గూప్‌వన్ అధికారుల అభినందనలు బాన్సువాడరూరల్, కోటగిరి, : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందటంతోమంగళవారం సాయంత్రం తెలంగాణ గ్రూప్‌వన్ అధికారులు తమ అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌ను ఢిల్లీలో కలిశారు. వర్ని మండలం రుద్రూర్ గ్రామానికి చెందిన తెలంగాణ గ్రూప్‌వన్ అధికారుల అసోసియేషన్ చైర్మన్ మామిండ్ల అంజయ్య(ఆర్టీఓ) ఢిల్లీనుంచి ఫోన్లో మాట్లాడారు. ఇ న్నేళ్లపాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమ రథసారథి కేసీఆర్‌కు తామంతా అభినందనలు తెలిపామన్నారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో తెలంగాణ గ్రూప్‌వన్ ఆఫీర్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి దరావత్ హన్మంతునాయక్, ఉపాధ్యక్షుడు అంజన్‌రావ్, కార్యనిర్వాహక కార్యదర్శి హరికిషన్, తదితరులు ఉన్నారు. -
అంచెలంచెలుగా విజయ అంచులకు...
సఖినేటిపల్లి, న్యూస్‌లైన్ :లక్ష్య సాధనలో అనుకున్నది సాధించకపోతే కొందరు కుంగిపోతారు. మరికొందరు సవాల్‌గా తీసుకుని అనుకున్నది సాధిస్తారు. ఆ కోవకు చెందినవారే స్వరూపారాణి. అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకూ నిద్రపోని ధీరురాలు. అందుకే ఆమె కలలుకన్న లక్ష్యం దాసోహమన్నది. ఆమె పట్టుదలకు విజయం మురిసిపోయింది. సివిల్స్‌లో డీఎస్పీగా ఎంపికై సఖినేటిపల్లికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారామె... ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి ఆమె చదువులో నంబరు ఒన్. స్థానికంగా ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆమె, మలికిపురం కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఎమ్మెస్సీ మెరైన్ బయోలజీని ఆంధ్రా యూనివర్సిటీలో పూర్తిచేశారు. అనంతరం రాజమండ్రిలో బీఈడీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపనతో పోటీ పరీక్షలపై ఆసక్తిని పెంచుకున్నారు. అంచెలంచెలుగా... అంతిమ లక్ష్య సాధనలో ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. 1995లో సెకండరీ గ్రేడ్ టీచరుగా తొలి ప్రయత్నంలోనే ఎంపికయ్యారు. ఈ వృత్తిలో ఆమె ఏడేళ్లు పని చేశారు. ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే గ్రూప్ పరీక్షల్లో విజయం సాధించాలన్న పట్టుదల పెంచుకున్నారు. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల నడుమ కోచింగ్ తీసుకునే అవకాశం లేకపోవడంతో, ఇంటి వద్దనే ఖాళీ సమయాల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు చదివేవారు. 2002లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. 2007 వరకూ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో విధులు నిర్వహించారు. 2007లో జరిగిన గ్రూప్-1 పోటీల్లో విజయం సాధించి ఎంపీడీఓగా ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలు మండలాల్లో ఎంపీడీఓగా ఆమె విధులను నిర్వర్తించారు. 2008లో తిరిగి గ్రూప్-1 పరీక్ష రాశారు. ఫలితాలను 2012లో ప్రకటించారు. దీనిలో ఆమె డీఎస్పీ కేడర్‌గా ఎంపికయ్యారు. కష్టపడితేనే ఫలితం కష్టపడి చదివితే విజయం వరిస్తుందని స్వరూపారాణి అన్నారు. గ్రూప్-1లో డీఎస్పీ కేడర్‌గా ఎంపికై, ఏపీ పోలీస్ అకాడమీలో శిక్షణ పొంది, ట్రెయినీ డీఎస్పీగా విజయనగరం జిల్లాకు వెళుతున్న సందర్భంగా విజయానికి తోడ్పడిన అంశాలను స్వరూపారాణి ‘న్యూస్‌లైన్’కుఫోన్లో వివరించారు. న్యూస్‌లైన్: మీ కుటుంబం నేపథ్యం స్వరూపారాణి: మాది తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి. తల్లి మేరీగోల్డ్, తండ్రి విజయరత్నం. చిన్నప్పటి నుంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే పట్టుదలతో చదివాను. అక్కలు, అన్నయ్యలు ప్రోత్సహించారు. న్యూ: గ్రూప్-1లో విజయానికి ఎవరు ప్రోత్సహించారు ? స్వరూపా: నేను గ్రూప్-1 చదవడానికి భర్త కెన్నిబాబు అన్ని రకాలుగా ప్రోత్సహించారు. అత్త,మామలు, కూతుళ్లు ఐశ్వర్య, ఆశ్లేష సహకరించారు. ఇంట్లో ప్రత్యేకంగా చదువుకోడానికి భర్త ఓగదిని ఏర్పాటు చేశారు. అందులోకి ఎవరినీ రానిచ్చేవారు కాదు. ఇంటర్నెట్లో గ్రూప్-1 సమాచారాన్ని సేకరించి, ప్రింట్ తీసి ఇచ్చేవారు. న్యూ: విద్యాభ్యాసం, ఉద్యోగాలు స్వరూపా: పదో తరగతి వరకూ సఖినేటిపల్లి లూథరన్ ఉన్నత పాఠశాల్లో చదివాను. డిగ్రీ మలికిపురంలో పూర్తి చేశాను. బీఈడీ రాజమండ్రిలో చదివి, 1995లో ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యాను. 2002లో ఫిషరీస్ డెవ లెప్మెంట్ అధికారిగా, 2007లో ఎంపీడీఓగా ఎంపికై, 2009లో బిజినేపల్లికి బదిలీపై వెళ్లాను. న్యూ: గ్రూప్-1కు ఎలా సిద్ధపడ్డారు? స్వరూపా: ఇంటి వద్దనే ఉంటూ పుస్తకాలు చదివాను. పత్రికల్లో ప్రచురించే సంపాదకీయాలు చదవడం బాగా ఉపయోగపడ్డాయి. మెయిన్స్ చదవడానికి ఉద్యోగానికి నాలుగు నెలలు శెలవు పెట్టాను. న్యూ: ప్రజాసమస్యలపై మీ స్పందన ? స్వరూపా: పోలీసుగా మహిళల అభ్యున్నతికి కృషిచేస్తాను. మహిళలపై జరుగుతున్న అరాచ కాలపై ప్రత్యేక దృష్టి పెడతాను. దాదాపుగా 22 ఏళ్లుగా వివిధ ఉద్యోగాలు చేసిన అనుభవం ఉంది. ఎంపీడీఓగా ప్రజలతో మమేకమయ్యాను. గ్రామాల్లో సమస్యలు, శాంతిభద్రతల పరిరక్షణపై కొంత అవగాహన ఉంది. ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాను.