
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలోనూ లబ్ధిదారులకు కష్టం కలగకుండా బియ్యం పం పిణీ చేస్తున్నామని, తమ సమస్యలపై ప్రభు త్వం తక్షణమే స్పందించకుంటే జూన్ ఒకటినుంచి సరుకుల పంపిణీ నిలిపివేస్తామని మరో మారు రేషన్ డీలర్లు పౌర సరఫరాల శాఖకు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌కు రేషన్ డీలర్ల సం ఘం రాష్ట్ర కమిటీ వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు మాట్లాడుతూ, కరోనాతో డీలర్లు పిట్టల్లా రాలిపోతున్నారని, ఇప్పటికే 70 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కరోనా సోకిన పలువురు డీలర్లు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకోలేక ఇళ్లలోనే ప్రాణాలు వదులుతున్నారని చెప్పారు. బియ్యం ఇచ్చే పద్ధతిలో మార్పు చేసి కాంటాక్టు లెస్ ద్వారా సరుకులు పంపిణీ చేసే విధంగా చూడాలని, డీలర్లకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ చేయాలని, గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన మేరకు కమీషన్ పెంచుతూ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కమిషనర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment