సాక్షి, హైదరాబాద్: సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎల్లుండి మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
విజయరామారావు మాజీ ఎమ్మెల్యే కూడా. సర్వీస్ నుంచి రిటైర్డ్ అయ్యాక.. టీడీపీలో చేరి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్(హైదరాబాద్) నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పీ జనార్థన్‌రెడ్డి మీద విజయం సాధించారు. ఆ వెంటనే కేబినెట్‌లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. 2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి దానం నాగేందర్(కాంగ్రెస్) చేతిలో ఓడారు.
విజయరామారావు పుట్టింది వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారంలో!. అయితే కుటుంబ మూలాలున్న ఏపీలోనే(నెల్లూరు) ఉన్నత చదువులు సాగాయి. పైచదువులకు మద్రాసు యూనివర్సిటీలో చేరి బీఏ చేశారు. ఆపై 1958 అక్టోబరులో కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో లెక్చరర్ ఉద్యోగంలో చేరాడు. ఆ మరుసటి ఏడాదే సివిల్స్ అర్హత సాధించి.. ట్రైనింగ్‌తర్వాత చిత్తూరు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డైరెక్టర్‌గా హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢచర్యం కేసు,ముంబై బాంబు పేలుళ్లు లాంటి ప్రముఖ కేసులను దర్యాప్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment