గణేష్ ఉత్సవ సమితి కార్యాలయం ప్రారంభం
అబిడ్స్: గణేష్ ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సిద్ధంబర్‌బజార్ బహెతీభవన్‌లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ భాగ్యనగరం పరిధిలో నిర్వహించే 45వ సామూహిక గణేష్ ఉత్సవాల కోసం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గ్రేటర్ నలుమూలలా 24 నియోజకవర్గాలకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం లక్షకు పైగా గణేష్ మండపాలను ప్రతిష్టిస్తామన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన గణేష్ ఉత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. 17వ తేదీన అనంత చతుర్ధశి రోజు గణేష్ నిమజ్జనం చేస్తామన్నారు. ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్ మాట్లాడుతూ దైవభక్తి, దేశభక్తి, దేశ సంస్కృతిని సంరక్షించే విధంగా గణేష్ ఉత్సవాలు కొనసాగుతాయన్నారు.
రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం తమ ఉత్సవ సమితితో సమన్వయ సమావేశం నిర్వహించి వేడుకలు విజయవంతంగా అయ్యేవిధంగా కృషి చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మెట్టు వైకుంఠం, ఉత్సవ సమితి నాయకులు కౌడి మహేందర్, రమే‹Ù, శ్రీరామ్‌వ్యాస్, ఆల భాస్కర్, రూప్‌రాజ్, సలహాదారులు కోరడి మాల్, మాధవీలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment