
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) శుక్రవారం లేఖ రాసింది. ఆగస్టు 3వ తేదీన నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని జీఆర్‌ఎంబీ కోరింది. గోదావరి నదీ జలాల విషయమై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదాలు కూడా చర్చిస్తారని సమాచారం. బోర్డు నిర్వహించే ఈ సమావేశంపై తెలుగు రాష్ట్రాలు హాజరవుతాయో లేదో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment