
సాక్షి, హైదరాబాద్ : టీఎస్–బీపాస్ దరఖా స్తుదారుల నుంచి వసూలు చేయాల్సిన కస్టమర్ చార్జీలను ప్రభుత్వం ఖరారు చేసింది. భవన/లే–అవుట్‌లకు అనుమతుల కోసం వసూలు చేసే వివిధ రకాల ఫీజులు, చార్జీ లకు కస్టమర్ చార్జీలు అదనం కానున్నాయి. దరఖాస్తు సమయంలో ఆన్‌లైన్ ద్వారా ఈ రుసుంను చెల్లిం చాలి. ప్లాట్ విస్తీర్ణం ఆధారంగా వినియోగదారుల రుసుంను లెక్కించి వసూలు చేయనున్నారు. ప్లాట్ విస్తీర్ణం 500 చదరపు మీటర్లకు మించితే విస్తీర్ణం ఆధారంగా మొత్తం పర్మిషన్ ఫీజులో 1 శాతం నుంచి 2.50 శాతం వరకు కస్టమర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్ చార్జీల వివరాలిలా ఉన్నాయి..
ప్లాట్ విస్తీర్ణం వినియోగ రుసుం
1. 75 చదరపు గజాలలోపు ఉచితం
2. 75 చదరపు గజాల నుంచి 200 చదరపు మీటర్లలోపు రూ.500
3. 200–500 చ.మీ. రూ.1000
4. 500–1000 చ.మీ. మొత్తం రుసుంలో 1%
5. 1,000 – 2,000 చ.మీ. మొత్తం రుసుంలో 2%
6. 2 వేల చ.మీ.కు పైన మొత్తం రుసుంలో 2.5%