
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/మఠంపల్లి: కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఆ పారీ్టకి 40, 50 స్థానాల్లో అభ్యర్థులే లేరని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. అభ్యర్థులే కరువైన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తామంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందన్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఏరియా ఆస్పత్రిని 200 పడకలకు అప్‌గ్రేడ్ చేసే పనులకు మంత్రి హరీశ్‌రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. దీనితోపాటు 29 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలకు ఎన్‌ఎస్పీ క్యాంపు మైదానంలో శంకుస్థాపన చేశారు. తర్వాత ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్ ఆతీ్మయ సమ్మేళనంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌లతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలి
తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని.. రాష్ట్ర పథకాలకు ఎన్నో అవార్డులు వచి్చన విషయం కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కనిపించడం లేదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నవారే గల్లీలో అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, జిల్లాకో మెడికల్ కాలేజీ వంటి పథకాలన్నింటినీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాపీకొట్టి పేర్లు మార్చుకుని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు అవాస్తవ ప్రచారంతో విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయని.. బీఆర్‌ఎస్ కార్యకర్తలు అభివృద్ధి అనే అస్త్రంతో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో నిరుద్యోగం లేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులకే పదవుల నిరుద్యోగం పట్టుకుందని విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్ సీఎం తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉందని చెప్పడం విడ్డూరమని, ముందు వారి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చుకోవాలని హితవుపలికారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఏళ్ల తరబడి పాలించిన జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు జిల్లా అభివృద్ధి కోసం ఏం చేశారని హరీశ్‌రావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక నల్లగొండ, నకిరేకల్‌లో బత్తాయి, నిమ్మ మార్కెట్లు ఏర్పాటు చేశామని.. ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశామని చెప్పారు.
కేసీఆర్ పుణ్యానే కాంగ్రెస్, బీజేపీ నేతలకు పదవులు: జగదీశ్‌రెడ్డి
కాంగ్రెస్ పాలనలో ప్రజలను గాలికి వదిలేసి, తమ కురీ్చలను కాపాడుకోవడమే ఆ పార్టీ నేతలకు సరిపోయిందని.. ఇప్పుడా ముసలి సింహాలు కూర్చొని గాండ్రిస్తున్నాయని మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నాడు తెలంగాణ ఆకలి చావులతో అల్లాడితే.. నేడు కేసీఆర్ పాలనలో దేశానికే అన్నం పెట్టే స్థాయికి రైతులు ఎదిగారని చెప్పారు. కేసీఆర్ పుణ్యమా అని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పదవులు అనుభవిస్తున్నారని.. టీపీసీసీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల అడ్రస్‌లు పుట్టింది కేసీఆర్ వల్లేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులకు నమ్మకం లేకనే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఆ హక్కు కాంగ్రెస్, బీజేపీలకు లేదు
ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయకుండా ముఖం చాటేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరిపే నైతిక హక్కు లేదని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ ఆతీ్మయ సమ్మేళనంలో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కులు, గిరిజన యూనివర్సిటీ ఇచి్చన తరువాతే బీజేపీ నాయకులు ఆవిర్భావ ఉత్సవాలు జరపాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment