సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సోమవారం చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దాఖలైన పిల్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తెచ్చిన జీహెచ్‌ఎంసీ చట్టం సెక్షన్ 52ఇ రిజర్వేషన్ పాలసీకి విరుద్ధంగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, రెగ్యులర్ రొటేషన్ చేసేంత వరకు గ్రేటర్ ఎన్నికలు నిర్వహించ వద్దని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టీస్ విచారిస్తారని తెలిపిన న్యాయవాది అభిషేక్ రెడ్డి.. పిల్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేశారు. రేపు ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. చదవండి: ‘గ్రేటర్’ ఎన్నికలకు తొందరొద్దు
Comments
Please login to add a commentAdd a comment